Advertisement

  • దేశాలు దాటిన రాజమౌళి కీర్తి ..ట్విట్టర్ లో కీర్తిస్తూ రష్యా ఎంబసీ ట్వీట్

దేశాలు దాటిన రాజమౌళి కీర్తి ..ట్విట్టర్ లో కీర్తిస్తూ రష్యా ఎంబసీ ట్వీట్

By: Sankar Sat, 06 June 2020 6:37 PM

దేశాలు దాటిన రాజమౌళి కీర్తి ..ట్విట్టర్ లో కీర్తిస్తూ రష్యా ఎంబసీ ట్వీట్

తెలుగుతో పాటు భారతీయ సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెప్పిన చిత్రం బాహుబలి విడుదలై దాదాపు మూడేళ్లు అవుతున్న ఈ సినిమా క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. దర్శకధీరుడు రాజమౌళి , యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కాంబినేషన్‌ల వచ్చిన ఈ బ్లాక్‌ బస్టర్‌ చిత్రానికి సంబంధించిన ఏదో ఒక అంశం నిత్యం వార్తల్లో ఉంటుంది. రెండు వారాల క్రితం బాహుబలి 2 సినిమా రష్యా టెలివిజన్‌లో ప్రసారం కావడం పెద్ద చర్చనీయాంశంగా మారిని విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. తాజాగా బాహుబలి సినిమా, దర్శకుడు రాజమౌళిని కీర్తిస్తూ రష్యా ఎంబసీ శుక్రవారం ట్వీట్‌ చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది..


rajamouli,bahubali,russia embassy,india,tollywood , రాజమౌళి,  రష్యా, ఎంబసీ, .ట్విట్టర్,  బాహుబలి 2

39వ మాస్కో అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2017 లో జరగగా అందులో బాహుబలి చిత్రాలను ప్రదర్శించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆ వేడుకలకు భారత సినీ పరిశ్రమ ప్రతినిధిగా రాజమౌళి హాజరై ప్రసంగించారు. ‘భారతీయ డీఎన్‌ఏలో కుటుంబ విలువలు ఎక్కువగా ఉంటాయి. నా ప్రధాన లక్ష్యం భారతీయ కుటుంబ విలువలను ప్రపంచంతో పంచుకోవడమే. అదే ఈ సినిమాలో చేశాను.. విజయం సాధించాను. బాహుబలి కథ కూడా కుటుంబ విలువల గురించే ఉంటుంది. సోదరులు, తల్లి-కొడుకు, భార్యాభర్తలు ఇలా అనేక రకాల బంధాలతో కుటుంబ విలువలను కాపాడుతున్న వారికి నా ఈ సినిమా అంకితం’ అంటూ రాజమౌళి మాస్కో ఇంటర్నెషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రసంగించారు.

రాజమౌళి అప్పుడు చేసిన ప్రసంగానికి సంబంధించిన ఫోటోతో పాటు మరెన్నో తీపి జ్ఞాపకాలను రష్యా ఎంబసీ నెమరువేసుకుంటూ తమ అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. కాగా ఈ వేడుకలకు రాజమౌళితో పాటు ఆయన సతీమణి రమా రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ, తదితరులు పాల్గొన్నారు. ఇక గత నెల 28న బాహుబలి-2 చిత్రం రష్యా భాషల్లోకి అనువదింపబడి అక్కడి టెలివిజన్లలో ప్రసారమైంది. రష్యా భాషలో ప్రసారమైన ఈ చిత్రానికి అనూహ్యమైన స్పందన కనిపించింది అని రష్యా ఎంబసీ ఓ ప్రకటనలో తెలిపిన విషయం తెలిసిందే.

Tags :
|

Advertisement