Advertisement

  • అది దేశభక్తి సినిమా కాదు ..క్లారిటీ ఇచ్చిన ఆర్ ఆర్ ఆర్ టీం

అది దేశభక్తి సినిమా కాదు ..క్లారిటీ ఇచ్చిన ఆర్ ఆర్ ఆర్ టీం

By: Sankar Sun, 11 Oct 2020 6:20 PM

అది దేశభక్తి సినిమా కాదు ..క్లారిటీ ఇచ్చిన ఆర్ ఆర్ ఆర్ టీం


దిగ్గజ దర్శకుడు రాజమౌళి , టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్ , ఎన్టీఆర్ లతో తీస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌..సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో కొమురమ్‌ భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్నారు.

కరోనా కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, రామ్ చరణ్ కు సంబంధించిన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి మరో పోస్టర్ ను ఆర్ఆర్ఆర్ తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ పోస్టర్‌లో వెనుక అశోక ధర్మ చక్రం, ముందు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ చేతులు కలిపినట్లుగా ఉంది.

ఈ పోస్టర్ కు అనూహ్యమైన స్పందన లభిస్తుంది. ఈ లుక్‌ చూసినవారిలో కొందరు 'ఆర్‌ఆర్ఆర్‌' చిత్రంలో ఎన్టీఆర్‌, చరణ్‌లు కలిసి స్వాతంత్య్ర కోసం పోరాడుతారని కామెంట్స్‌ పెట్టారు. దీనిపై చిత్ర బృందం క్లారీటీ ఇచ్చింది. ‘ఆర్‌ఆర్ఆర్‌’ లో ఎన్టీఆర్‌, చరణ్‌లు కలుసుకుంటారని, ఫొటోలో ఉండేది వారి చేతులే పేర్కొంది. కానీ ఇది దేశ భక్తి సినిమా కాదని, ఫిక్షనల్‌ మూవీయే అని మరోసారి స్పష్టం చేసింది.

Tags :
|

Advertisement