Advertisement

  • సడక్ 2 ట్రైలర్ రెస్పాన్స్ చూసి టెన్షన్ పడుతున్న ఆర్ఆర్ఆర్ మేకర్స్ ?

సడక్ 2 ట్రైలర్ రెస్పాన్స్ చూసి టెన్షన్ పడుతున్న ఆర్ఆర్ఆర్ మేకర్స్ ?

By: Sankar Fri, 14 Aug 2020 10:35 AM

సడక్ 2 ట్రైలర్ రెస్పాన్స్ చూసి టెన్షన్ పడుతున్న ఆర్ఆర్ఆర్ మేకర్స్  ?

సుశాంత్ సింగ్ మరణం బాలీవుడ్ ను ఒక కుదుపు కుదిపేసింది ...ఎంతో టాలెంట్ , పేరు మరియు డబ్బు ఉంది కూడా సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న విషయాన్నీ చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు..దీనంతటి కారణం బాలీవుడ్ లో ఉన్న నేపోటిజం అని చాల మంది సెలెబ్రిటీలు కూడా వ్యాఖ్యానించారు..

అయితే నేపోటిజం మీద ఇటీవల వ్యాఖ్యలు చేసిన అలియా భట్ మీద అభిమానులు తీవ్ర నెగటివ్ గా ఉన్నారు..ఎంతలా అంటే ఆమె తాజాగా నటించిన సడక్ 2 సినిమా ట్రైలర్ కు ప్రపంచంలోనే ఏ ట్రైలర్ కు రానంత డిస్ లైక్స్ వచ్చాయి .. దీని బట్టే అర్థం అవుతుంది అలియా భట్ మీద ఎంత నెగటివిటీ ఉంది అనేది ..

తాజా ప‌రిస్థితుల‌ని బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ 'ఆర్.ఆర్.ఆర్' లో అలియా భట్ క‌థానాయిక‌గా నటించబోతున్న సంగతి తెలిసిందే. మ‌రి ఈ అమ్మ‌డి సెగ ఆర్ఆర్ఆర్ కు కూడా త‌గులుతుందా అని మేక‌ర్స్ భ‌య‌ప‌డిపోతున్నారు. సినీ జనాల్లో సుశాంత్ పై ఉన్న సింపతీ అలియా లాంటి వాళ్ళ‌పై నెగిటివిటీగా మార‌డంతో ఫిలిం మేక‌ర్స్ డైలమాలో ప‌డ్డారు. ఏదేమైన సుశాంత్ కేసు ఓ కొలిక్కి వ‌చ్చే వ‌ర‌కు వీళ్ల‌కు ఈ బాధ‌లు త‌ప్ప‌వేమో.

Tags :
|

Advertisement