Advertisement

ఆర్ఆర్ఆర్ స్టోరీ దేశభక్తి సినిమా కాదు...?

By: chandrasekar Wed, 14 Oct 2020 4:23 PM

ఆర్ఆర్ఆర్ స్టోరీ దేశభక్తి సినిమా కాదు...?


ఇటీవలే భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ సినిమా తిరిగి ప్రారంభమైంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం మొత్తం థర్మల్ స్క్రీనింగ్ తరువాత షూటింగ్ ప్రారంభించారు. అంతే కాకుండా షూటింగ్‌కి సంబంధించిన పరికరాలను కూడా శానిటైజ్ చేసిన తరువాతే షూటింగ్ ప్రారంభిస్తున్నట్టు మూవీ యూనిట్ ఓ వీడియో ద్వారా పేర్కొంది. అక్టోబర్ 10న డైరెక్టర్ జక్కన్న పుట్టినరోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీం ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఒక పోస్టర్‌ని విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో అశోక చక్రం లాంటి చక్రంపై రెండు చేతులు కలిసిన ఫొటో ఉంది. ఆ ఫొటో గురించి ఒక అభిమాని 'అల్లూరి సీతా రామరాజు, కొమురం భీం ఇద్దరూ కలిసి దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారు' అని చెప్పడానికి సూచికనే ఈ పోస్టర్ అని కామెంట్ చేశాడు.

ఆర్ఆర్ఆర్ టీమ్..అభిమాని చేసిన ఈ కామెంట్‌కి స్పందించి౦ది. 'ఆ రెండు చేతులు అల్లూరి సీతా రామరాజు, కొమురం భీం వే... వాళ్లిద్దరూ కలుస్తారు అనేంత వరకు కరెక్టే కానీ పైన కామెంట్‌లో చెప్పినట్టుగా ఈ సినిమాలో వాళ్లు స్వాతంత్య్రం కోసం పోరాడరు. ఆర్ఆర్ఆర్ సినిమా మొత్తం కల్పిత కథ, దేశభక్తి సినిమా కాదు' అని క్లారిటీ ఇచ్చారు. అందరూ భావించినట్లుగా ఆర్ఆర్ఆర్ సినిమా దేశ భక్తి సినిమా కాదు, ఫిక్షనల్ మూవీ అని ఈ రిప్లై ద్వారా రాజమౌళి మరోసారి సమాధానం ఇచ్చాడు.

Tags :
|
|

Advertisement