Advertisement

అక్టోబర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా..!

By: Anji Wed, 23 Sept 2020 10:59 AM

అక్టోబర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా..!

ఎస్‌.ఎ్‌స.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ అక్టోబర్‌లో ప్రారంభం కానుందని సమాచారం. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న రామ్‌ చరణ్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ అలియాభట్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే! ఏప్రిల్‌ నెలలో అలియాభట్‌ కాల్షీట్లు ఇచ్చారు. కానీ కరోనా, లాక్‌డౌన్‌ వల్ల షూటింగ్‌కు అంతరాయం కలిగింది.

తాజాగా ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు అలియా రెండు నెలలు కేటాయించారట. డిసెంబర్‌, జనవరి నెలల్లో ఆమె బాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉండడంతో అక్టోబర్‌, నవంబర్‌ నెలలు మాత్రమే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు కేటాయించిందనీ, దానికి తగ్గట్లు అక్టోబర్‌లో షెడ్యూల్‌ చేసుకోమని అలియా రాజమౌళికి సమాచారం అందించినట్లు తెలిసింది.

అందుకే రాజమౌళి అక్టోబర్‌లో షూటింగ్‌ ప్రారంభించబోతున్నారని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. మొదట అలియా సన్నివేశాలతోపాటు రామ్‌చరణ్‌, అలియాపై సాగే ఓ పాటను చిత్రీకరణ చేస్తారని తెలిసింది. ఇందులో కొమరం భీమ్‌గా జూ.ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు.

Tags :

Advertisement