Advertisement

  • మహారాష్ట్రలోని మహా బలేశ్వర్‌లో ఆర్ఆర్ఆర్ సినిమా షూట్

మహారాష్ట్రలోని మహా బలేశ్వర్‌లో ఆర్ఆర్ఆర్ సినిమా షూట్

By: chandrasekar Fri, 04 Dec 2020 5:48 PM

మహారాష్ట్రలోని మహా బలేశ్వర్‌లో ఆర్ఆర్ఆర్ సినిమా షూట్


ప్రముఖ హీరోలతో అగ్ర దర్శకుడు రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూట్ మహారాష్ట్రలోని మహా బలేశ్వర్‌లో ప్రారంభమైంది. ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ హీరోలుగా ‘రౌద్రం రణం రుధిరం’ అదే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కాల్పనిక స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథను రెడీ చేసాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ కథను కీలక మలుపు తిప్పే పాత్రలో నటించబోతున్నట్టు ఇప్పటికే రాజమౌళి తెలియజేసారు. ఇప్పటికే అల్లూరి సీతరామరాజుగా రామ్ చరణ్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు రామరాజు పాత్రకు కొమరం భీమ్ వాయిస్ ఓవర్ అదిరిపోయింది.

ఈ సినిమా కోసం రీసెంట్‌‌గా ఆర్ఆర్ఆర్ నుండి కొమరం భీమ్ టీజర్‌ను విడుదల చేసారు. రామరాజు వాయిస్ ఓవర్ మొదలైన ఈ టీజర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ కరోనా కారణంగా ఓ ఆరు నెలలు వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ రీసెంట్‌గా ప్రారంభమైంది. తాజాగా రాజమౌళి ఈ సినిమా షూటింగ్‌ను మహారాష్ట్రలోని మహా బలేశ్వర్‌లో షూట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ దృశ్యాలను రాజమౌళి అభిమానులతో పంచుకున్నారు. రోడ్డు మీద బైక్ పై ఓ వ్యక్తి రయ్ అంటూ దూసుకుపోతున్న సీన్స్‌ను డ్రోన్ సహాయంతో పిక్చరైజ్ చేస్తున్నారు. కానీ ఈ సన్నివేశంలో ఉన్నది ఎన్టీఆరా లేదా రామ్ చరణ అన్నది మాత్రం రాజమౌళి అండ్ టీమ్ క్లారిటీ ఇవ్వలేదు.

కరోనా ఆన్ లాక్ తరువాత ఇటీవలె హైదరాబాద్‌లో 50 రోజులు భారీ యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేసుకొని మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌కు ఆర్ఆర్ఆర్ టీమ్ బయలు దేరింది. అందులో అందమైన లోకేషన్స్‌లో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. బాహుబలి తర్వతా రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే యేడాది సమ్మర్‌లో కానీ రాజమౌళికి అచ్చొచ్చిన జూలైలో కానీ విడుదల చేస్తాడా అనేది వేచి చూడాలి. ఈ సినిమాపై అభిమానులు చాలా ఎదురు చూపుతో వున్నారు. ఈ భారీ సినిమా తప్పకుండా విజయం సాదిస్తుందని చెపుతున్నారు.

Tags :
|
|
|

Advertisement