Advertisement

  • ఇంస్టాగ్రామ్ లో అరుదయిన రికార్డు సృష్టించిన విజయ్ దేవరకొండ

ఇంస్టాగ్రామ్ లో అరుదయిన రికార్డు సృష్టించిన విజయ్ దేవరకొండ

By: Sankar Thu, 24 Dec 2020 12:01 PM

ఇంస్టాగ్రామ్ లో అరుదయిన రికార్డు సృష్టించిన విజయ్ దేవరకొండ


కేవలం ఒక్క సినిమాతోనే టాలీవుడ్ లో స్టార్ హీరోల జాబితాలో చేరిన నటుడు విజయ్ దేవరకొండ ...అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతాకాదు ఆ ఒక్క సినిమాతోనే విజయ్ ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు..ఇక ఆయా తర్వాత గీత గోవిందం సినిమాతో ఆ క్రెజ్ మరింత పెరిగింది..

ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ కి సోషల్ మీడియా లో వున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. తాజాగా ఈ రౌడీ హీరో ఇంస్టాగ్రామ్ లో విజయ్ 10 మిలియన్ మార్క్ ను దాటాడు. సౌత్ ఇండియా మొత్తంలో 10 మిలియన్ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న ఏకైక హీరో విజయ్ దేవరకొండ.

అది కూడా తను ఇంస్టాగ్రామ్ లోకి ఎంటరైన తక్కువ సమయంలో చేరుకోవడం మరో విశేషం. ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ దర్శకత్వం లో "ఫైటర్" అనే సినిమా చేస్తున్నాడు విజయ్..నోటా , డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాలతో సరైన హిట్ లేని విజయ్ ఫైటర్ సినిమాతో తిరిగి హిట్ ట్రాక్ ఎక్కాలని భావిస్తున్నాడు..

Tags :

Advertisement