Advertisement

  • వర్మ పవర్ స్టార్ సినిమా నుంచి తొలి పాట నేడే విడుదల .

వర్మ పవర్ స్టార్ సినిమా నుంచి తొలి పాట నేడే విడుదల .

By: Sankar Sun, 19 July 2020 1:32 PM

వర్మ పవర్ స్టార్ సినిమా నుంచి తొలి పాట నేడే విడుదల .



సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ప‌వ‌ర్ స్టార్ అనే పేరుతో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సెటైరిక‌ల్ మూవీగా వ‌స్తున్న ఈ చిత్రం జూలై 25న విడుద‌ల కానున్న‌ట్టు తాజాగా ప్ర‌కటించారు. మ‌రికొద్ది రోజుల‌లో మూవీ విడుద‌ల కానున్న నేపథ్యంలో ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు. ఈ సినిమా ట్రైల‌ర్ జూలై 22న ఉద‌యం 11 గంట‌ల‌కు రిలీజ్ చేయ‌నున్న ఆర్జీవి ఈ సినిమా నుంచి "గ‌డ్డి తింటావా?" పాట‌ నేడు సాయంత్రం ఐదు గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్నారు.

ప‌వ‌ర్ స్టార్ చిత్రంలోని పాత్ర‌లు కొంద‌రు ప్ర‌ముఖులు వ్యక్తుల‌ని పోలి ఉన్నాయి. ఇది యాదృచ్చికంగా జ‌రిగింద‌ని మొద‌టి నుండి చెబుతున్న వ‌ర్మ‌.. తాజాగా ‘ప‌వ‌ర్ స్టార్’ సినిమాలో ఓ క్యారెక్టర్‌ అంటూ... అతడు ఎవరి పోలికతో అయినా ఉన్నాడా అంటూ ట్వీట్‌ చేశారు. ఈ ఫోటోలో వ్య‌క్తి ఎవ‌రి మాదిరిగా ఉన్నాడో వెంట‌నే గుర్తు ప‌ట్టిన అభిమానులు వ‌రుస ట్వీట్స్ చేస్తున్నారు.

అయితే ముందు నుంచి ఈ సినిమా కు సంబంధించిన వరుస పోస్టర్లతో ఊపేస్తున్న వర్మ జనాల్లో హైప్ తీసుకురావడంలో బాగా సక్సెస్ అయ్యాడు అయితే ఆ సక్సెస్ ని కాష్ చేసుకోవడం కోసం ఇంతవరకు ప్రపంచ సినీ చరిత్రలో ఎవ్వరు చేయని విధంగా ట్రైలర్ చూడాలంటే కూడా రేట్ ఫిక్స్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు ..పవర్ స్టార్ ట్రైలర్ చూడాలంటే 25 రూపాయలు చెల్లించాలని వర్మ ట్విట్టర్లో పోస్ట్ చేసాడు..మరి చూడాలి వర్మ ఇంకెన్ని సంచనాలకు తేర తీస్తారో ..

Tags :
|
|
|

Advertisement