Advertisement

వెబ్ సిరీస్ లో నటిస్తున్న రేణూ దేశాయ్

By: chandrasekar Mon, 21 Sept 2020 09:50 AM

వెబ్ సిరీస్ లో నటిస్తున్న రేణూ దేశాయ్


రేణూదేశాయ్ ఫాలోవ‌ర్ల‌కు గుడ్‌న్యూస్‌. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ యాక్టింగ్ చేయ‌నున్నారు రేణూదేశాయ్‌. కెమెరా ముందుకొస్తున్నా..దీవించండి అని రేణూ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా కోరింది.

కృష్ణ‌మామిడాల డైరెక్ష‌న్ లో వ‌స్తున్న వెబ్ సిరీస్ లో రేణూ దేశాయ్ న‌టిస్తున్నారు. వ‌చ్చే నెల‌లో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ విష‌యాన్ని రేణూ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపింది. మ‌ళ్లీ కెమెరా ముందుకొస్తున్నాను. నేను ఓ అంద‌మైన వెబ్ సిరీస్ కు సంత‌కం చేశాన‌ని ప్ర‌క‌టిస్తున్నందుకు సంతోషంగా, ఎక్జ‌యిటింగ్ గా ఉంది.

వ‌చ్చే నెల‌లో షూటింగ్ మొద‌ల‌వుతుంది. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌జేస్తా. స‌త్యాన్వేష‌ణ‌లో ఉన్న ఓ మ‌హిళాప్ర‌యాణానికి మీ దీవెన‌లు, ప్రేమ‌ను అందించాల‌ని కోరుతున్నాన‌ని పోస్ట్ లో తెలిపింది.

Tags :
|

Advertisement