Advertisement

  • ఉదయభాను ఛాలెంజ్ స్వీకరించిన రేణు దేశాయ్ ..

ఉదయభాను ఛాలెంజ్ స్వీకరించిన రేణు దేశాయ్ ..

By: Sankar Fri, 03 July 2020 3:10 PM

ఉదయభాను ఛాలెంజ్ స్వీకరించిన రేణు దేశాయ్ ..



గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటారు సినీ నటి, రచయిత రేణూ దేశాయ్‌. ‘పుడమి పచ్చగుండాలే–మన బతుకులు చల్లగుండాలే’అనే నినాదంతో ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన ఈ చాలెంజ్‌ మూడో దశలో భాగంగా మొక్కలు నాటిన యాంకర్ ఉదయభాను.. బ్రహ్మానందం, రేణూ దేశాయ్‌లకు ఛాలెంజ్‌ విసిరారు. ఉదయ భాను విసిరిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి రేణూ శుక్రవారం ఉదయం తన కూతురు ఆద్యతో కలిసి మొక్కలు నాటారు.

హరితహారంలో భాగంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ స్పూర్తితో ప్ర‌తి ఒక్క‌రు త‌మ‌కి తాము ఛాలెంజ్ విసురుకొని మొక్క‌లు నాటాల‌ని రేణూ విజ్ఞప్తి చేశారు. ఇక ఆద్యతో కలిసి రేణూ మొక్కలు నాటిన ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇక ఇప్పటికే గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను మంత్రి కేటీఆర్‌, కవిత, చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, మహేశ్‌ బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌, సచిన్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, గోపీచంద్‌, ప్రభాస్‌, యాంకర్‌ సుమ, అనసూయ, రష్మి లాంటి ఎందరో సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్‌ స్వీకరించి మరి కొందరికి సవాల్‌ విసిరారు. సవాలును స్వీకరించిన అనేక మంది ప్రముఖులు, సామాన్యులు సైతం మొక్కలు నాటుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగమవుతున్నారు..

తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా హరితహారంను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది ..అయితే కరోనా వంటి పరిస్థితుల్లో కూడా ఇలా సెలబ్రిటీస్ ముందుకు వచ్చి మొక్కలు నాటుతూ ప్రజలకు మంచి సందేశాన్ని ఇస్తున్నారు

Tags :
|

Advertisement