Advertisement

  • సోను సూద్ కు గుడి కట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అది ఎక్కడో తెలుసా...?

సోను సూద్ కు గుడి కట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అది ఎక్కడో తెలుసా...?

By: Anji Mon, 21 Dec 2020 12:40 PM

సోను సూద్ కు గుడి కట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అది ఎక్కడో తెలుసా...?

కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న రోజుల్లో నిరుపేదలను ఆదుకున్న సినీనటుడు సోను సూద్ కు తెలంగాణ రాష్ట్ర సిద్దిపేట జిల్లాలో అభిమానులు ఎక్కంగా ఆయనకు గుడి కట్టారు.

దుల్మిట్టమండలం దుబ్బతండాలో గుడి కట్టి అందులో విగ్రహం ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. గుడిలో నిత్య పూజలు చేస్తామని గ్రామస్థులు పేర్కొన్నారు.

తమ గ్రామం చుట్టూ 18 తండాలు ఉన్నాయని... చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా... దాదాపు 20 కిలోమీటర్ల వరకు ఆస్పత్రి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ప్రాంతంలో సోనూసూద్ సహకారంతో ఆస్పత్రి నిర్మాణం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. సోనూసూద్ త్వరలోనే తమ గ్రామాన్ని సందర్శించేందుకు వస్తారని ఆకాంక్షించారు.

Tags :

Advertisement