Advertisement

  • రవితేజ క్రాక్ మూవీ మేకింగ్ వీడియో రిలీజ్...!

రవితేజ క్రాక్ మూవీ మేకింగ్ వీడియో రిలీజ్...!

By: Anji Mon, 12 Oct 2020 7:28 PM

రవితేజ క్రాక్ మూవీ మేకింగ్ వీడియో రిలీజ్...!

గత కొంతకాలంగా మాస్ రాజా రవితేజ హిట్ లేక సతమతమవుతున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్లో క్రాక్ మూవీ చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన బలుపు , పవర్ చిత్రాలు భారీ విజయాలు సాధించడం తో క్రాక్ సైతం అదే రీతిలో విజయం సాదిస్తుందని అభిమానులు , చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కరోనా ఎఫెక్ట్ తో నిలిచిపోయిన సినిమా షూటింగ్ రీసెంట్ గా రామోజీఫిలింసిటీలో మొదలయ్యింది. రెండు రోజుల క్రితం సెట్ లో రవితేజ జాయిన్ అయ్యినట్లు చిత్ర యూనిట్ తెలిపారు . రవితేజ , శృతిహాస‌న్, ఇత‌ర న‌టీన‌టులపై వ‌చ్చే కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.

వాస్త‌వ సంఘ‌ట‌నల ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని బి మ‌ధు నిర్మిస్తున్నారు. కాగా సెట్ లో కరోనా జాగ్రత్తలు ఎలా పాటిస్తూ షూటింగ్ చేస్తున్నారో మేకింగ్ వీడియో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

Tags :
|
|

Advertisement