Advertisement

  • నన్ను కూడా సినిమాలో నుంచి అర్ధాంతరంగా తీసేసారు ..రవీనా టాండన్

నన్ను కూడా సినిమాలో నుంచి అర్ధాంతరంగా తీసేసారు ..రవీనా టాండన్

By: Sankar Tue, 07 July 2020 9:47 PM

నన్ను కూడా సినిమాలో నుంచి అర్ధాంతరంగా తీసేసారు ..రవీనా టాండన్



సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తరువాత బాలీవుడ్‌లో విపరీతగా వినిపిస్తున్న మాట నెపోటిజం. బాలీవుడ్‌లో బంధుప్రీతి అధికంగా ఉందని, దాని కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు బాలీవుడ్‌లోని పలువురు సెలబ్రిటీలు తామూ నెపోటిజం బాధితులమేనంటూ వాపోతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో ఒకప్పటి హీరోయిన్ రవీనా టండన్ కూడా చేరారు.

బాలీవుడ్‌లో తోటి నటులను దెబ్బతీసేందుకు ఎప్పుడూ కొంతమంది ఎదురుచూస్తూ ఉంటారని, తాను కూడా అలాంటి వారి వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఓ సినిమాలో నటించేందుకు నేను హీరోయిన్‌గా ఎంపికయ్యా. ముహూర్త కార్యక్రమానికి వెళ్లేందుకు రెడీ అవుతున్నా. డిజైనర్స్ నా డ్రెస్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇంతలో ఓ ఫోన్ కాల్ వచ్చింది. నన్ను సినిమాలో నుంచి తొలగించేసినట్లు అవతలి వ్యక్తి చెప్పారు.

నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ తర్వాత తెలిసిందేంటంటే.. హీరో గర్ల్‌ఫ్రెండ్‌కు నేను నచ్చలేదట. అందుకే నన్ను సినిమాలో నుంచి తొలగించారట. ఈ విషయం తెలిసి మరింత ఆశ్చర్యపోయా. అయితే మనల్ని దెబ్బ తీసేందుకు ఎప్పుడూ ఎవరో ఒకరు ఎదురు చూస్తుంటారని అర్థం చేసుకుని నన్ను నేను సమర్థించుకున్నానంటూ రవీనా చెప్పుకొచ్చారు. ఇలాంటి అనుభవాలు ఎన్నో సార్లు తనకు ఎదురయ్యాయని, అయితే వాటన్నింటినీ ఎదుర్కొని ఈ స్థాయిలో ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.



Tags :
|
|

Advertisement