Advertisement

రామ్ చరణ్ సరసన నటించనున్న రష్మిక

By: chandrasekar Wed, 09 Sept 2020 09:48 AM

రామ్ చరణ్ సరసన నటించనున్న రష్మిక


రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి క్రేజ్లో వున్నా హీరోయిన్. మెగా స్టార్ ఫ్యామిలిలో రామ్ చరణ్ తో, రష్మిక మందన్న జంటగా నటించబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఇండస్ట్రీలో ఒక్కో స్టార్ హీరోను కవర్ చేసుకుంటూ వచ్చిన ఈమె ఇప్పుడు చరణ్‌తో కూడా రొమాన్స్ చేయబోతుందని ప్రచారం జరుగుతుంది. చరణ్ ప్రస్తుతం రాజమౌళి RRR సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత కొందరు దర్శకులను లైన్‌లో పెట్టాడు. ఇదిలా ఉంటే ఈ మధ్యలోనే మరో సినిమా కూడా చరణ్ చేయనున్నాడు. అదే తన తండ్రి చిరంజీవి సినిమాలో గెస్ట్ రోల్. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఓ పాత్ర కోసం చరణ్‌ను అడిగితే వెంటనే ఒప్పుకున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో నక్సలైట్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తుంది. బయటికి వచ్చిన ఫోటోలు చూస్తుంటే చిరు నక్సలైట్ అని అర్థమవుతుంది. ఈ చిత్రంలో చిరంజీవి, చరణ్ గురు శిష్యులుగా నటిస్తున్నారు. ముందు మహేష్ బాబును అనుకున్నా కూడా రెమ్యునరేషన్ మరీ ఎక్కువ అడిగాడని అతన్ని కాదని చరణ్‌ను తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. లాక్‌డౌన్ పూర్తైన తర్వాత నెల రోజులు ఈ చిత్రం కోసమే డేట్స్ ఇచ్చాడు మెగా పవర్ స్టార్. దాదాపు అరగంట పాటు ఇందులో చరణ్ పాత్ర ఉంటుందని కథను మలుపు తిప్పేలా ఉండబోయే ఈ పాత్ర కోసం చరణ్ ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో చరణ్‌కు జోడీగా రష్మిక మందన్న నటించబోతుందని తెలుస్తుంది.

ముందు ఈ పాత్ర కోసం కియారా అద్వానీతో సమంత, పూజా హెగ్డేను కూడా అడిగినా కూడా వాళ్లు ఆసక్తి చూపించకపోవడంతో రష్మిక మందన్నను తీసుకోవాలని దర్శక నిర్మాతలు చూస్తున్నారు. ఈ చిత్రంలో ఐటెం సాంగ్ కోసం మాత్రం రెజీనాని తీసుకోవడం.. ఇప్పటికే ఆమెపై ఆ స్పెషల్ సాంగ్ చిత్రీకరించడం కూడా జరిగాయి. ఇప్పుడు చరణ్, రష్మిక అంటున్నారు.. ఏదేమైనా కూడా చాలా స్పెషల్స్‌తో చిరంజీవి ఆచార్య వచ్చేస్తుంది. దసరాకు ఈ చిత్రం విడుదల కానుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా చిరంజీవి సినిమాను నిర్మిస్తున్నాయి. 2021 సమ్మర్ కానుకగా ఆచార్యను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ పుష్పలో నటిస్తుంది రష్మిక. ఇప్పుడు చరణ్‌తో అవకాశం వచ్చేలా కనిపిస్తుంది. అభిమానులు వీరి సినిమా కోసం బాగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది.


Tags :
|
|

Advertisement