Advertisement

  • విజయ్‌దేవరకొండ అమ్మ పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న రష్మిక మందన్న

విజయ్‌దేవరకొండ అమ్మ పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న రష్మిక మందన్న

By: chandrasekar Fri, 25 Sept 2020 09:09 AM

విజయ్‌దేవరకొండ అమ్మ పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న రష్మిక మందన్న


టాలీవుడ్ ప్రముఖ యంగ్ హీరో విజయ్‌దేవరకొండ అమ్మ పుట్టినరోజు వేడుకలో రష్మిక మందన్న పాల్గొనింది. వెండితెరపై విజయ్‌దేవరకొండ, రష్మిక మందన్న జోడీ హిట్‌పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. వీరిద్దరి జోడీ చూడముచ్చటగా, కన్నులపండువగా ఉంటుందని అభిమానులు సంబరపడిపోతుంటారు.

వీరిద్దరి జంటగా కలిసి నటించిన గీతగోవిందం, డియర్‌ కామేడ్‌ చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి. తెరవెనక కూడా విజయ్‌, రష్మిక మధ్య చక్కటి స్నేహసంబంధాలున్నాయి. తాజాగా విజయ్‌దేవరకొండ అమ్మగారైన మాధవి గురువారం హైదరాబాద్‌లోని స్వగృహంలో తన పుట్టినరోజు వేడుకల్ని జరుపుకున్నారు.

విజయ్‌దేవరకొండ అమ్మగారి పుట్టిన రోజు వేడుకకు రష్మిక మందన్న హాజరైంది. విజయ్‌ కుటుంబసభ్యులతో ఆనందంగా గడిపింది. ఈ సెలబ్రేషన్‌ తాలుకూ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. విజయ్ మరియు రష్మిక అభిమానులు ఈ ఫోటోలను సోషమీడియాలో పంచుకుంటున్నారు.

Tags :

Advertisement