Advertisement

  • రష్మిక, రక్షిత్‌ మళ్లీ కలిసి నటించబోతున్నారా

రష్మిక, రక్షిత్‌ మళ్లీ కలిసి నటించబోతున్నారా

By: chandrasekar Fri, 19 June 2020 2:14 PM

రష్మిక, రక్షిత్‌ మళ్లీ కలిసి నటించబోతున్నారా


ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది రష్మిక. ఈ భామ గతంలో తన కోస్టార్‌, కన్నడ నటుడు రక్షిత్‌శెట్టితో నిశ్చితార్థం జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత రక్షిత్‌, రష్మిక ఆలోచనలతో ఇరు కుటుంబాలు ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకున్నాయి.

హఠాత్తుగా ఎంగేజ్‌మెంట్‌ రద్దు చేసుకోవడంతో రష్మిక, రక్షిత్‌ అభిమానులు రకరకాలు గాసిప్స్‌ తెరపైకి తెచ్చారు. దీంతో కుటుంబసభ్యులందరి అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్మిక స్పష్టం చేసింది. పెళ్లికి ముందే దూరమైన ఈ జంట మరోసారి కలవనున్నారట.

కన్నడలో రక్షిత్‌శెట్టితో కలిసి కిర్రిక్‌పార్టీ చిత్రంతో సినీపరిశ్రమలో అడుగుపెట్టింది రష్మిక. ఈ సూపర్‌ హిట్‌ చిత్రానికి సీక్వెల్‌ రూపొందించాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు టాక్‌ వినిపిస్తోండగా రష్మికను మరోసారి హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు వార్త చక్కర్లు కొడుతోంది.

రక్షిత్‌శెట్టి మాత్రం ఈ చిత్రంలో హీరోయిన్‌గా కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని నిర్మాతలకు సూచించాడట. మరి రష్మిక, రక్షిత్‌ క్రేజీ కాంబినేషన్‌ మరోసారి సిల్వర్‌స్క్రీన్‌పై కనబడుతుందా అని వేచి చూడాల్సిందే.

Tags :

Advertisement