Advertisement

అలా..వైకుంఠపురం రీమేక్ లో ఆ స్టార్ హీరో ...?

By: Sankar Wed, 03 June 2020 8:18 PM

అలా..వైకుంఠపురం రీమేక్ లో ఆ స్టార్ హీరో ...?

ఇండియా లో అత్యంత ప్రజాధారణ పొందిన మూవీ ఇండస్ట్రీ అంటే ఎవరైనా చెప్పే సమాధానం బాలీవుడ్ ..మార్కెట్ పరంగా , ఆదాయం పరంగా బాలీవుడ్ అగ్రస్థానం లో ఉంటుంది ..అయితే గత కొద్దీ సంవత్సరాలుగా టాలీవుడ్ మార్కెట్ గణనీయంగా పెరిగింది..మన సినిమాలను బాలీవుడ్ లో రీమేక్లు ఎక్కువగా పెరిగాయి ..తాజాగా టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఆలా వైకుంఠపురం సినిమా హిందీలో రీమేక్ చేయబోతున్నారు..ఇప్పటికే ఈ రీమేక్ హక్కుల కోసం బాలీవుడ్ బడా నిర్మాత పెద్ద మొత్తం వెచ్చించారని టాక్.

ranvir singh,allu arjun,ala vaikuntapuram,trivikram,pooja hegde ,బాలీవుడ్ , టాలీవుడ్, ఆలా వైకుంఠపురం ,  రీమేక్,  త్రివిక్రమ్ శ్రీనివాస్

లేటెస్ట్ సమాచారం మేరకు 'అల.. వైకుంఠపురములో' హిందీ రీమేక్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయనతో సంప్రదింపుల కార్యక్రమం కూడా ఫినిష్ అయిందని టాక్. ముందుగా ఈ రీమేక్‌ కోసం సల్మాన్ ఖాన్, షాహిద్ కపూర్ పేర్లను పరిగణలోకి తీసుకున్న ఆ నిర్మాత చివరకు రణ్‌వీర్ సింగ్ వైపు మొగ్గు చూపారని తెలుస్తోంది. మరోవైపు డైరెక్టర్ వేట కూడా మొదలు పెట్టారట. అతిత్వరలో ఈ మూవీపై అఫీషియల్ ప్రకటన రానుందని బాలీవుడ్ వర్గాల నుంచి అందిన సమాచారం.

అయితే తెలుగులో అల్లు అర్జున్- పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా రూపొందిన 'అల.. వైకుంఠపురములో' చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. థమన్ కట్టిన బాణీలు ఎల్లలు దాటి భాషాభేదం లేకుండా శ్రోతలను అలరించాయి. దీంతో ఈ మూవీ హిందీ రీమేక్‌‌పై ప్రత్యేక శ్రద్ద పెట్టారట బాలీవుడ్ బడా నిర్మాత. ప్రీ ప్రొడక్షన్ మొదలుకొని నటీనటుల ఎంపిక వరకు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటూ సెలక్షన్ ప్రాసెస్ మొదలు పెట్టారట.

Tags :

Advertisement