Advertisement

  • ఓటిటి లో విడుదల అవుతున్న కోలీవుడ్ స్టార్ హీరో సినిమా ..

ఓటిటి లో విడుదల అవుతున్న కోలీవుడ్ స్టార్ హీరో సినిమా ..

By: Sankar Thu, 16 July 2020 8:02 PM

ఓటిటి లో విడుదల అవుతున్న కోలీవుడ్ స్టార్ హీరో సినిమా ..



కరోనా కారణంగా థియేటర్లు అన్ని మూత పడ్డాయి ..మళ్ళీ ఎప్పుడు తెరుచుకుంటాయో ఎవరు చెప్పలేని పరిస్థితి ..ఒకవేళ ఓపెన్ అయినా కూడా ఇంతకుముందులాగా ప్రేక్షకులు వస్తారా అంటే అనుమానమే ..దీనితో నిర్మాతలు ఓటిటి వైపుకు మొగ్గు చూపుతున్నారు ..ఓటిటి లో అయితే కదలకుండా ఇంట్లో కూర్చొనే సినిమాను ఆస్వాదించవచ్చు ...దీనితో ఇపుడు ప్రముఖ హీరోల సినిమాలు కూడా ఓటిటి లో విడుదల అయ్యేందుకు మొగ్గు చూపుతున్నారు ..

తాజాగా ప్రముఖ తమిళ్ హీరో జీవా హీరోగా రాజు మురుగన్ దర్శకత్వంలో అంబేద్ కుమార్ నిర్మించిన చిత్రం ‘జిప్సి’. జూలై 17న తెలుగు ఓటీటీ ఆహా ద్వారా తెలుగు ప్రేక్షకులను జిప్సి పలకరించనున్నారు..అయితే ఈ సినిమా విడుదల సందర్భంగా హీరో జీవ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు ..

జీవా మాట్లాడుతూ ‘‘‘జిప్సి’చిత్రంలో హీరో ఈ ప్రపంచాన్ని తన ఇల్లుగా భావించే క్యారెక్టర్. అది కాకుండా జిప్సీ పాత్ర దేశమంతటా సంచరించే యువకుడిని బేస్ చేసుకుని సినిమాను తెరకెక్కించాం. అందుకని ఓ ప్రత్యేకమైన ప్రాంతాన్ని ఆధారంగా చేసుకని సినిమా చేయలేదు. ఇదొక యూనిట్ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం. హీరో పాత్రకు ఓ భాషను పెట్టామంతే. ఇలాంటి ఓ పాయింట్‌ను తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారనే నమ్మకంతోనే తెలుగులో సినిమాను విడుదల చేస్తున్నాం. నాకు తెలిసి సినిమాకు హద్దులు లేవు.

ప్రస్తుత పరిస్థితులు ప్రేక్షకులు అన్నీ రకాల సినిమాలను, వెబ్ సిరీస్‌లను చూస్తున్నారు. నేను కూడా అలాగే విదేశీ భాషలు, తెలుగు సినిమాలను చూశాను. ఓ నటుడిగా అన్నీరకాల సినిమాలను చేయాలనే భావిస్తాను. అందుకనే ఓ ఫార్మేట్‌ సినిమాలను చేయకుండా డిఫరెంట్ మూవీస్ చేశాను. నేను బాలీవుడ్‌లో నటించిన ‘83’ సినిమా కూడా యూనివర్సల్ మూవీ. దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలాంటి సినిమాలను భాషా బేదంతో చూడకూడదు. అందులో నటించేటప్పుడు కూడా భాషతో మనకు అవసరం ఉండదు.

యాక్టర్‌గా న్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా సినిమాలు చేయాలనే అనుకుంటాను. నిర్మాత తనయుడిగా చాలా రకాల కథలను వింటూ ఉంటాను. ఇంతకు ముందు ప్రస్తావించినట్లు లైఫ్ టైమ్ క్యారెక్టర్ జిప్సీకి ప్రపంచమే ఇల్లు.. హీరోయిన్ నటాషాకు ఇల్లే ప్రపంచం. ఇద్దరు వేర్వేరు మనస్తత్వాల వ్యక్తులు కలుసుకున్నప్పుడు వారెలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారనేదే ఈ సినిమా’’ అన్నారు.

Tags :
|
|
|
|
|

Advertisement