Advertisement

  • నితిన్ పెళ్లి సందర్భంగా సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేసిన రంగ్ దే చిత్ర యూనిట్

నితిన్ పెళ్లి సందర్భంగా సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేసిన రంగ్ దే చిత్ర యూనిట్

By: Sankar Sun, 26 July 2020 12:44 PM

నితిన్ పెళ్లి సందర్భంగా సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేసిన రంగ్ దే చిత్ర యూనిట్



నితిన్ హీరోగా న‌టిస్తున్న చిత్రం "రంగ్‌దే". 'మ‌హాన‌టి' కీర్తి సురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ఈ సినిమా తెర‌కెక్కిస్తున్నారు. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.

కాగా నితిన్ ఐదు రోజుల పెళ్లిలో ఇప్ప‌టికే నిశ్చితార్థం, మెహందీ కార్య‌క్ర‌మం జ‌రిగాయి. నేడు మ‌రో కీల‌క‌ ఘ‌ట్టం ఆవిష్కృతం కానుంది. వేద మంత్రాల సాక్షిగా షాలిని మెడ‌లో ఆయ‌న‌ మూడు ముళ్లు వేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా అభిమానుల‌కు 'రంగ్‌దే' టీమ్ గుర్తుండిపోయే బ‌హుమ‌తిచ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ వెల్ల‌డించింది..

తిన్ అభిమానుల‌కు, సినీ ప్రేమికుల‌కు ఎప్ప‌టికీ గుర్తుండిపోయేలా నేడు సాయంత్రం 4.05 నిమిషాల‌కు పెళ్లి గిఫ్ట్‌ను రివీల్ చేయ‌నున్నాం" అని ప్ర‌క‌టించారు. దీంతో పండ‌గ చేసుకుంటున్న నితిన్ అభిమానులు సాయంత్రం ఎప్పుడ‌వుతుందా అని క్ష‌ణానికొక‌సారి గ‌డియారం వంక చూస్తున్నారు. మ‌రోవైపు ఈ గిఫ్ట్ ఏమ‌య్యుంటుందా అని కొంద‌రు లెక్క‌లు వేస్తుంటే, ప‌క్కాగా ట్రైల‌ర్ అయ్యుంటుంద‌ని ఆయ‌న అభిమాన గ‌ణం అంచ‌నా వేస్తోంది.

కాగా ఈ ఏడాది బీష్మ సినిమాతో బంపర్ హిట్ కొట్టిన నితిన్ , రంగ్ డే సినిమాతో కూడా ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలనీ చూస్తున్నాడు ..అందుకే తనకు కలిసి వచ్చిన లవ్ జోనర్ నే ఈ సినిమా కోసం ఎంచుకున్నడు ..మరి చూడాలి ఈ సినిమాతో బీష్మ రికార్డు లను బద్దలు కొడతాడో లేదో ..

Tags :
|
|
|

Advertisement