Advertisement

  • రానా మిహీకా బజాజ్ ప్రీ-వెడ్డింగ్ సందడి ప్రారంభం

రానా మిహీకా బజాజ్ ప్రీ-వెడ్డింగ్ సందడి ప్రారంభం

By: chandrasekar Fri, 07 Aug 2020 5:31 PM

రానా మిహీకా బజాజ్ ప్రీ-వెడ్డింగ్ సందడి ప్రారంభం


రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ పెళ్లికి ముందు జరిగే తంతును ఇరువురి ఇళ్లలో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు బయటికి వస్తున్నాయి. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి మరో రెండు రోజుల్లో తన బ్యాచ్‌లర్ లైఫ్‌కు బైబై చెప్పబోతున్నారు. ప్రేయసి మిహీకా బజాజ్‌ను ఆయన పెళ్లాడబోతున్నారు. ఇప్పటికీ ఇరువురి ఇళ్లలో ప్రీ-వెడ్డింగ్ సందడి మొదలైపోయింది.

జూబ్లీహిల్స్‌లోని మిహీకా బజాజ్ ఇంట్లో బుధవారం నిర్వహించిన పసుపు దంచే కార్యక్రమంతో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఈ పసుపు వేడుకలో కాబోయే పెళ్లికూతురు మిహీకా పసుపు, బంగారు వర్ణం లెహెంగాలో మెరిసిపోయారు. అలాగే, ఆమె ధరించిన గవ్వల ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సముద్రంలో దొరికే చిన్న చిన్న గవ్వలతో చేసిన ఆభరణాలను మిహీకా ధరించారు.

పాపిట బొట్టు, చెవి జుంకీలు, చేతి కడియాలను గవ్వలతో తయారు చేశారు. వాటిని అందంగా మిహీకాకు అలంకరించారు. ఈ ఆభరణాలు కాస్త కొత్తగా ఉన్నా చాలా అందంగా, ప్రత్యేకంగా ఉన్నాయి. మిహీకా తల్లి బంటీ బజాజ్ ప్రముఖ జువెలరీ డిజైనర్. అందుకే, తన కుమార్తెకు ఈ గవ్వల ఆభరణాలను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టున్నారు. ఇక రానా విషయానికి వస్తే ఆయన తెలుపు రంగు షర్ట్, ధోతిలో చాలా సింపుల్‌గా ఉన్నారు.

పసుపు దంచే వేడుకలో మిహీకాతో తీసుకున్న ఫొటోను రానా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలో కాబోయే దంపతులు మెరిసిపోతున్నారు. చిరునవ్వులు చిందిస్తున్నారు. ఇదిలా ఉంటే, గురువారం సాయంత్రం మిహీకా ఇంట మెహందీ వేడుక జరగనుంది. ఈ మెహందీ ఫంక్షన్ కోసం లేత గులాబీ వర్ణం లెహెంగాలో మిహీకా ముస్తాబవుతున్నారు. కాగా, రానా-మిహీకా వివాహం ఈనెల 8న అంటే శనివారం రామానాయుడు స్టూడియోస్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో జరగబోతుంది.

Tags :
|
|
|

Advertisement