Advertisement

  • వైరల్ అవుతున్న రానా - మిహిక వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో

వైరల్ అవుతున్న రానా - మిహిక వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో

By: Sankar Fri, 24 July 2020 3:43 PM

వైరల్ అవుతున్న రానా - మిహిక వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో



టాలీవుడ్ భల్లాలదేవుడు రానా పెళ్లి చేసుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే ..కరోనా లాక్ డౌన్ సమయంలో ఒక్క సారిగా తన ప్రేయసి అయినా మిహిక బజాజ్ ను పరిచయం చేసి అందరికి షాక్ ఇచ్చాడు రానా ..అయితే వీరిద్దరి పెళ్ళికి రెండు కుటుంబాలు ఒప్పుకున్నాయి ..రానా తండ్రి, నిర్మాత సురేష్ బాబు, మిహికాతో ఆగస్టు 8వ తేదీన రానా పెళ్లి ఉంటుందని చెప్పేశారు. మే 21వ తేదీన రానా, మిహిక కుటుంబాలు రాకా ఫంక్షన్ ద్వారా ఒక్కటై వారి పెళ్లి జరగనుందని అధికారికంగా తెలిపారు.

ఇక తాజాగా ఇరు కుటుంబాలు అనుకున్న ఆ తేదీ ఆగస్టు 8నే పెళ్లి వేడుక జరగనుందని పేర్కొంటూ ఓ‌ పెళ్లి పత్రికను అందరి ముందుంచారు. ఈ వివాహ పత్రికను వీడియో రూపంలో ఎంతో అద్భుతంగా డిజైన్ చేయడం విశేషం. పౌరాణికం థీమ్‌ తీసుకొని పాత చిత్రం మాయాబజార్'లోని సన్నివేశాన్ని జత చేస్తూ రానా, మిహికాల ఫొటోలతో ఆసక్తికరంగా రూపొందించారు. దీంతో రానా వివాహ పత్రిక క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆగస్టు 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు, చైతన్య ఎన్‌క్లేవ్, ఖాజాగూడ, మణికొండ, హైదరాబాద్‌లో రానా- మిహికా వివాహం జరుగుతుందని ఈ పత్రిక ద్వారా వెల్లడించారు. అయితే కరోనా విలయతాండం చేస్తున్న కారణంగా ప్రభుత్వ నిబంధనలను అనుసరించి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలోనే రానా వివాహ వేడుక జరగనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పెళ్ళికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నట్లు సమాచారం. ఈ పెళ్లి పత్రిక చూసిన రానా ఫ్యాన్స్.. బ్యూటిఫుల్ జోడీకి పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.




Tags :
|
|
|
|

Advertisement