Advertisement

ఆగస్ట్‌ 8వ తేదీన రానా, మిహీకాబజాజ్ వివాహం

By: chandrasekar Mon, 22 June 2020 5:10 PM

ఆగస్ట్‌ 8వ తేదీన రానా, మిహీకాబజాజ్ వివాహం


యువ కథానాయకుడు రానా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. తన చిరకాల ప్రేయసి మిహీకాబజాజ్‌ను ఆయన పెళ్లాడనున్నారు. ఆగస్ట్‌ 8వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. వీరి వివాహానికి ఇప్పటి నుంచే ఏర్పాటు ఊపందుకున్నాయి. సమీప బంధువర్గం మాత్రమే హాజరు కానున్నారు.

తాజా తెలిసిన సమాచారం ప్రకారం ఈ జంట పెళ్లికి చారిత్రక తాజ్‌ఫలక్‌నుమా ప్యాలెస్‌ హోటల్‌ వేదికకానుంది. ఈ పెళ్లికి సంబంధించిన రాయల్‌థీమ్‌ సెటప్‌, డెకరేషన్స్‌ను వృత్తిపరంగా ఇంటీరియర్‌ డిజైనర్‌ అయిన మిహీకజజాజ్‌ స్వయంగా పర్యవేక్షించనుందట.

కరోనా‌ నిబంధనల నేపథ్యంలో వివాహానికి పరిమిత సంఖ్యలో అతిథుల్ని ఆహ్వానించే అవకాశం ఉందని అయితే పెళ్లి ఏర్పాట్లు మాత్రం ఘనంగా ఉండాలని కుటుంబ పెద్దలు భావిస్తున్నారని చెబుతున్నారు.

Tags :
|
|

Advertisement