Advertisement

  • బంధుప్రీతి లేని రంగం లేదు ..రాంగోపాల్ వర్మ

బంధుప్రీతి లేని రంగం లేదు ..రాంగోపాల్ వర్మ

By: Sankar Wed, 24 June 2020 5:12 PM

బంధుప్రీతి లేని రంగం లేదు ..రాంగోపాల్ వర్మ



రామ్ గోపాల్ వర్మ ఏది మాట్లాడిన స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉంటుంది ..తాను మాట్లాడినంత దైర్యంగా ఇంకెవ్వరు మాట్లాడలేరు ...ఇటీవలి కరోనా కాలంలో ఇండస్ట్రీ మొత్తం సైలెంట్ గా ఉంటె వర్మ మాత్రం రెచ్చిపోతున్నాడు ..ఒక వైపు సినిమాలు , మరోవైపు ఇంటర్వ్యూలు ఇలా తెగ హంగామా చేస్తున్నాడు ..అయితే ఇటీవల మరణించిన సుశాంత్ సింగ్ రాజపుత్ కేవలం ఇండస్ట్రీలో ఉన్న బంధుప్రీతి వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడు అని దేశం మొత్తం అంటుంటే వర్మ మాత్రం దాన్ని తేలిగ్గా కొట్టిపారేశాడు ..

బంధుప్రీతి లేని మనిషి ఉండదు అది ప్రతి ఇండస్ట్రీ లో ఉంటుంది , సినిమా , రాజకీయం , క్రీడలు ఇలా అన్ని రంగాలలో ఉంటుంది ..కేవలం బంధుప్రీతి ఉంటేనే సక్సెస్ అవుతారు అనలేము ..తెలుగు ఇండస్ట్రీ లో ఇప్పుడు ఉన్న స్టార్లలో విజయ్ దేవరకొండకు ఇండస్ట్రీలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేడు, అయన తండ్రి గారు కూడా ఇండస్ట్రీ మనిషి కాదు అయినా కూడా విజయ్ ఈ రోజు ఉన్న స్టార్ హీరోలలో ఒకడు ..టాలెంట్ ఉంటె మనల్ని ఎవ్వరు ఆపలేరు ..అయితే స్టార్ కిడ్స్ అయితే ఫస్ట్ సినిమాతోనే నిరూపించుకోవాల్సిన అవసరం ఉండదు వాళ్లకు కొంత టైం ఉంటుంది కానీ చివరకు టాలెంట్ ఉంటేనే ఎవరైనా ఇండస్ట్రీ లో నిలబడగలరు అని వర్మ వ్యాఖ్యానించాడు ..

చివరకు సినీ ఇండస్ట్రీ లో ఒక వ్యక్తి హీరోనా , లేదా జీరోనా అనేది తేల్చేది ప్రేక్షకులు మాత్రమే..ని దగ్గర టాలెంట్ ఉంటె వాళ్ళే నిన్ను నిలబెడతారు అని వర్మ అన్నాడు ..ఇక సుశాంత్ విషయంలో ఆయన ఫెయిల్యూర్ అని అనలేం. ఫ్లాప్ హీరో అని అనలేం. తనని తాను ప్రూవ్ చేసుకున్నారు. బాలీవుడ్‌లో టాప్ 15 స్టార్ హీరోల్లో ఒకరిగా ఉన్నారు. అతని ఆత్మహత్యకు ఫెయిల్యూర్ అనేది కారణం అని నిర్ధారించలేం’ అంటూ చెప్పుకొచ్చారు వర్మ.

Tags :

Advertisement