Advertisement

  • వర్మ 'పవర్ స్టార్' నుంచి మరొక సంచలన పోస్టర్ ..

వర్మ 'పవర్ స్టార్' నుంచి మరొక సంచలన పోస్టర్ ..

By: Sankar Sun, 12 July 2020 07:00 AM

వర్మ 'పవర్ స్టార్' నుంచి మరొక సంచలన పోస్టర్ ..



సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తన కొత్త సినిమా పవర్ స్టార్ విషయంలో ఏ మాత్రం తగ్గేటట్లు కనిపించడం లేదు ..ఎవరి నిజ జీవిత కాదు అని చెబుతూనే వరుస ఫొటోలతో ఒక వర్గం అభిమానుల ఆగ్రహానికి గురి అవుతున్నాడు ..ఇప్పటికే వరుసగా పోస్టర్లతో ట్విట్టర్ను ఊపేసిన వర్మ ..తాజాగా మరికొన్ని పోస్టర్లను ట్విట్టర్లో రిలీజ్ చేసారు ..

తన 'పవర్ స్టార్' సినిమాలో పీకే, ఎమ్మెస్, ఎన్‌బీ, టీఎస్‌, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీతో పాటు ఓ రష్యన్ మహిళ కూడా ఉంటుందని ముందుగానే ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ.. చెప్పినట్లుగానే ఆ
రష్యన్ మహిళ లుక్ రిలీజ్ చేసి సినిమాపై చర్చలు ముదిరేలా చేశారు. అంతేకాదు ఈ పోస్టర్ రిలీజ్ చేస్తూ ఇది 'పవరొమాంటిక్ పోస్టర్' అని ఆయన పేర్కొనడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ ఇష్యూగా మారింది.

కాగా ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథను పోలి ఉంది అని అభిమానులు తీవ్రంగా విమర్శిస్తున్నారు ..అయితే వర్మ మాట్లాడుతూ ''లార్డ్ బాలాజీ మీద ఒట్టేసి చెబుతున్నా.. ఈ మూవీలో ఎవరినీ తక్కువ చేసి చూపించను'' అని పేర్కొనడం మరో ఆసక్తికర అంశం. చూడాలి మరి ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో అతిత్వరలోనే రిలీజ్ కానున్న ఈ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో...

Tags :
|
|

Advertisement