Advertisement

  • వరుస ఫొటోలతో సోషల్ మీడియాను ఊపేస్తున్న వర్మ

వరుస ఫొటోలతో సోషల్ మీడియాను ఊపేస్తున్న వర్మ

By: Sankar Thu, 09 July 2020 7:15 PM

వరుస ఫొటోలతో సోషల్ మీడియాను ఊపేస్తున్న వర్మ



రాంగోపాల్ వర్మ ఇటీవల చేసేవి చూస్తుంటే అన్నం లేకపోయినా బతకగలడేమో గాని కాంట్రవర్సీ లేకుండా బతకలేడేమో అనిపిస్తుంది ..మొన్నటి వరకు అమృత ప్రణయి , మారుతీ రావు ల కథను సినిమా తీస్తున్నట్లు హడావిడి చేసిన వర్మ ..ఇప్పుడు సరికొత్త సంచలానికి తెరలేపాడు .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు పోలిన వ్యక్తిని పెట్టుకొని పవర్ స్టార్ టైటిల్ తో సినిమా తీస్తు సరికొత్త వివాదానికి తెర లేపిన వర్మ తాజాగా ట్విట్టర్లో వరుస ఫోటోలు పెడ్తూ షాక్ ల మీద షాకులు ఇస్తున్నాడు..

మొదట పవర్ స్టార్ ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు వర్మ. ఇందులో కనిపిస్తున్న నటుడు అచ్చం పవన్ కళ్యాణ్ పోజ్ పెట్టి కూర్చోవడం చూస్తుంటే.. వర్మ టార్గెట్ గట్టిగానే పెట్టారని తెలుస్తోంది. పైగా ఈ పోస్టర్‌పై ''ఎన్నికల ఫలితాల తర్వాత కథ'' అని రాయడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చలకు తెరలేపింది.

ఇప్పుడు ఏకంగా చిరంజీవి , పవన్ కళ్యాణ్ లను పోలిన వ్యక్తుల స్టిల్స్ ట్విట్టర్లో రిలీజ్ చేసాడు..పవన్ ఏదో సమస్యలో ఉన్నట్టుగా కనిపిస్తుండటం..చిరంజీవి అతనికి నచ్చజెప్పుతున్నట్టుగా కనిపిస్తున్న ఈ పోస్టర్ సినిమాకు విపరీతమైన పబ్లిసిటీ తెస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.అయితే ఇలా వరుస ఫొటోలతో సంచలనం సృష్టిస్తున్న వర్మ ముందు రోజుల్లో ఇంకెన్ని సంచలనకు తెర తీస్తారో చూడాలి

Tags :
|

Advertisement