Advertisement

  • నేను ఎవ్వరికి సపోర్ట్ కాదు ..అమృత ప్రణయ్ వ్యాఖ్యలపై వర్మ వివరణ

నేను ఎవ్వరికి సపోర్ట్ కాదు ..అమృత ప్రణయ్ వ్యాఖ్యలపై వర్మ వివరణ

By: Sankar Mon, 22 June 2020 2:39 PM

నేను ఎవ్వరికి సపోర్ట్ కాదు ..అమృత ప్రణయ్ వ్యాఖ్యలపై వర్మ వివరణ



మర్డర్ ఫస్ట్ లుక్ పోస్టర్ చుసిన తర్వాత అమృత ప్రణయి.. రాంగోపాల్ వర్మపై చేసిన కామెంట్ల మీద వర్మ ట్విట్టర్లో వరుసగా ట్వీట్లు పెట్టాడు ..మొదటగా నేను రిలీజ్‌ చేసిన పోస్టర్‌లో మర్డర్‌ ఒక నిజ జీవిత కథ ఆధారంగా తీస్తున్నది అని స్పష్టంగా చెప్పాను. కానీ నేను తీసిందే నిజమని ఎక్కడా చెప్పుకోలేదు. గతంలో కూడా నిజ జీవిత కథల ఆధారంగా నేను తీసిన ఎన్నో కథలను ప్రజలు ఆదరించారు.

నేను కొందరిని మంచివారిగా.. మరికొందరిని చెడువారిగా చూపిస్తున్నానంటూ అనుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే ఎవరూ చెడ్డవారు కాదు. పరిస్థితులు మాత్రమే మనిషిగా చెడుగా ప్రవర్తించేలా చేస్తాయని నేను గట్టిగా నమ్ముతాను. అమృత లేదా మరెవరైనా సరే బాధ అనుభవించిన వారిపై నాకు చాలా గౌరవం ఉంది. నా చిత్తశుద్ధితో వారి బాధలను గౌరవిస్తూ.. మర్డర్‌ సినిమాలో వారు ఎదుర్కొన్న పరిస్థితులనే చూపిస్తున్నట్లు' వర్మ పేర్కొన్నారు.

అయితే మర్డర్ ఫస్ట్ లుక్ తర్వాత అమృత ప్రణయి స్పందిస్తూ ..పోస్టర్‌ చూసిన వెంటనే ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. ప్రేమించిన పాపానికి భర్తను పోగొట్టుకున్నాను. కన్న తండ్రికి దూరమయ్యాను. నా జీవితం తలకిందులైంది. నా వ్యక్తిత్వం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు. నేను ఏంటనేది నాతో ఉన్న వాళ్లకి మాత్రమే తెలుసు. ఇప్పుడు వాటన్నిటినీ భరిస్తూ ఆత్మగౌరవంతో బతుకుతుంటే రామ్‌ గోపాల్‌ వర్మ రూపంలో నాకు మరో సమస్య ఎదురవుతోంది. దీనిని ఎదుర్కొనే శక్తి నాకు లేదు. ఏడుద్దామనుకున్నా కన్నీళ్లు ఇంకిపోయాయి. ప్రశాంతంగా ఉన్న సమయంలో సినిమా రూపంలో మరోసారి అందరి దృష్టి నాపై పడేలా చేస్తున్నావు. డబ్బు, పేరు కోసం నువ్వు ఇంత నీచానికి దిగజారుతావని అనుకోలేదు. ఎన్నో బాధలను అనుభవించిన నాకు ఈ బాధ మరీ పెద్దది కాదు' అంటూ అమృత వ్యాఖ్యలు చేశారు



Tags :
|

Advertisement