Advertisement

  • 'పవర్ స్టార్' మూవీ ఫస్ట్ లుక్ ముహూర్తం ఫిక్స్ చేసిన వర్మ ..

'పవర్ స్టార్' మూవీ ఫస్ట్ లుక్ ముహూర్తం ఫిక్స్ చేసిన వర్మ ..

By: Sankar Thu, 09 July 2020 09:29 AM

'పవర్ స్టార్' మూవీ ఫస్ట్ లుక్ ముహూర్తం ఫిక్స్ చేసిన వర్మ ..

కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ అత్యంత బాగా వాడుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం రామ్ గోపాల్ వర్మ మాత్రమే ..మాములు టైం లోనే వర్మ సినిమా అంటే అదొక సంచలనం లాగ ఉంటుంది ..అలాంటిది ఇప్పుడు అసలు సినిమాలే లేని టైం.. దీనితో వర్మ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన అది క్షణాల్లో వైరల్ అయిపోతుంది ..ఇప్పటికే ఈ లాక్ డౌన్ లో వరుస సినిమాలతో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వర్మ .ఇటీవలే పవర్ స్టార్ పేరుతో సినిమా తీస్తున్నట్లు ప్రకటించి మరొక సంచలానికి తెర లేపాడు ..అయితే ఈ సినిమా ఆగిపోయింది అని రకరకాల ఊహాగానాలు వచ్చినప్పటికీ తాజాగా వర్మ చేసిన ట్వీట్ తో అవన్నీ నిజంగానే ఊహాగానాలు అని తేలిపోయింది ..

తన సినిమా పేరు 'పవర్ స్టార్' అనేది మాత్రమే చూసి తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, తాను పవన్ కళ్యాణ్ బయోపిక్ తీయడం లేదంటూ స్పష్టం చేసిన రామ్ గోపాల్ వర్మ.. తాజాగా విడుదల చేసిన 'పవర్ స్టార్' టైటిల్ మధ్యలో గాజు గ్లాసు పెట్టి సంచలనానికి తొలి అడుగేశారు. అంతేకాదు ఇందులో నటిస్తున్న యాక్టర్‌ని హాఫ్ లుక్‌లో చూపిస్తూ పలు అనుమానాలకు తెరలేపారు. ఇక ఈ లుక్ పోస్ట్ చేస్తూ ''ఇందులో ఉన్న వ్యక్తి ఎవరినైనా పోలి ఉంటే యాదృచ్చికం మాత్రమే'' తన రెగ్యులర్ డైలాగ్ వాడేశారు వర్మ.

ఇకపోతే ఇదే పోస్ట్ ద్వారా 'పవర్ స్టార్' ఫస్ట్‌లుక్ విడుదల ముహుర్తాన్ని కూడా ప్రకటించేశారు రామ్ గోపాల్ వర్మ. దానికి ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ రోజు ఉదయం 11 గంటల 37 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. చూడాలి మరి టైటిల్ లుక్కే ఇలా డిజైన్ చేశారంటే.. ఫస్ట్‌లుక్ ఇంకెలా చూపించబోతారనేది!.


Tags :
|

Advertisement