Advertisement

  • సంచలన సినిమాకు తెరతీసిన వర్మ ..పవన్ కళ్యాణ్ మీద సినిమా ప్రకటన

సంచలన సినిమాకు తెరతీసిన వర్మ ..పవన్ కళ్యాణ్ మీద సినిమా ప్రకటన

By: Sankar Sun, 28 June 2020 2:47 PM

సంచలన సినిమాకు తెరతీసిన వర్మ ..పవన్ కళ్యాణ్ మీద సినిమా ప్రకటన



సంచలన సినిమాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుసగా సినిమాలను ప్రకటిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు ..కరోనా కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ విధించి ఎక్కడిక్కడ అన్ని సినిమాల షూటింగ్స్ వాయిదా పడితే వర్మ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ..మొన్నటికి మొన్న మియా మాల్కోవతో క్లైమాక్స్ అని సినిమా తీసిన వర్మ ఆ తరువాత వరుసగా కరోనా వైరస్ మీద కరోనా అనే పేరుతో , ఆ తర్వాత అమృత మారుతి రావు ల బయోపిక్ అంటూ మర్డర్ సినిమాలను ప్రకటించాడు ..

మొన్ననే ఒక ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఆకాశానికి ఎత్తిన వర్మ సరిగ్గా రెండు రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ మీద బయోపిక్ అంటూ మరొక సంచలనానికి తెర దీసాడు ..బ్రేకింగ్‌ న్యూస్‌: ఆర్జీవీ వరల్డ్‌ థియోటర్‌ కొత్త సినిమాకు ‘పవర్‌ స్టార్‌’ అని పేరు పెట్టాం. పీకే, ఎమ్‌ఎస్‌, ఎన్‌బీ, టీఎస్‌, ఓ రష్యన్‌ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీతో సినిమా తీయబోతున్నాం. ఈ సినిమాలోని పాత్రలు ఎవరో అర్థం చేసుకోవటానికి ఎటువంటి బహుమతులు ఇవ్వబడవు’’ అని పేర్కొన్నారు..

అనంతరం ‘పవర్‌ స్టార్‌’లో పాత్రధారికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు. ‘నా కొత్త సినిమా ‘పవర్‌ స్టార్‌’లో హీరో ఇతనే. అతడు మా ఆఫీస్‌ వద్దకు వచ్చినపుడు ఈ వీడియోను చిత్రీకరించాం. ఏ వ్యక్తినైనా పోలిన వ్యక్తులు ఉండటం యాధృచ్చికం కాని యాధృచ్చికం.. ఉద్ధేశ్యపూర్వకం కాని ఉద్ధేశ్యపూర్వకం’’ అంటూ తన దైన శైలిలో రాసుకొచ్చారు..ఇప్పటికే అనేక వివాదాస్పద సినిమాలతో ఎప్పుడు హాట్ టాపిక్ గా మారే వర్మ ఈ సినిమాతో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి ..

Tags :

Advertisement