Advertisement

  • గోండు వీరుడు కొమురం భీమ్ గా అదరగొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్..

గోండు వీరుడు కొమురం భీమ్ గా అదరగొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్..

By: Sankar Thu, 22 Oct 2020 2:34 PM

గోండు వీరుడు కొమురం భీమ్ గా అదరగొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్..


ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఇప్పటికే 75 శాతం పైగా షూటింగ్ జరుపుకున్నది. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్నారు. వీరిద్దరి వేరువేరు ప్రాంతాలు.. వేరు వేరు కాలాలు.

అయితే, ఈ సినిమాలో ఈ రెండు పాత్రలను ఎలా కలిపారు. ఎలా సినిమాను రన్ చేస్తున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. కాగా రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా 'భీమ్ ఫర్ రామరాజు' అని అల్లూరిగా రామ్ చరణ్ టీజర్ ను విడుదల చేసాడు జక్కన్న. అప్పటినుంచి ఎన్టీఆర్ టీజర్ కోసం అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

'రామరాజు ఫర్ భీమ్' టీజర్ ఇవాళ 11:30 నిమిషాలకు విడుదల చేశారు. ఈ టీజర్ లో కొమురం భీంగా ఎన్టీఆర్ ఇరగదీసాడు. రామ్ చరణ్ వాయిస్ ఓవర్ అదుర్స్ అనిపించేలా ఉంది. ఈ టీజర్ ను మొత్తం ఐదు భాషల్లో విడుదల చేశారు.

Tags :
|
|
|

Advertisement