Advertisement

  • మరో మణిరత్నం దొరికాడు అనుకున్న ..కానీ నన్ను హర్ట్ చేశారు..వర్మ పై రామజోగయ్య కామెంట్స్

మరో మణిరత్నం దొరికాడు అనుకున్న ..కానీ నన్ను హర్ట్ చేశారు..వర్మ పై రామజోగయ్య కామెంట్స్

By: Sankar Mon, 29 June 2020 4:08 PM

మరో మణిరత్నం దొరికాడు అనుకున్న ..కానీ నన్ను హర్ట్ చేశారు..వర్మ పై రామజోగయ్య కామెంట్స్



సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ పవర్ స్టార్ అనే సినిమా పేరును ప్రకటించగానే సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఆశ్చర్యానికి గురి అయ్యారు ..ఇటీవలి కాలంలో వర్మ తీస్తున్న సినిమాలను చూసి చాల మంది బాధపడుతున్నారు ..ఎందుకంటే ఒకప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో అగ్ర దర్శకులలో వర్మ ఒకడు , రంగీలా , శివ , మనీ , సత్య , సర్కార్ వంటి ఎన్నో అద్భుత సినిమాలు తీసిన ఘనత వర్మ సొంతం ..ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు వర్మ శిష్యులే ..ఇంతటి ఘన చరిత్ర ఉన్న వర్మ ఈ మధ్య కాలంలో మారి తీసికట్టుగా తయారు అయ్యాడు ..

తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై వర్మ మూవీ ప్రకటించిన వెంటనే.. రామజోగయ్య శాస్త్రి ట్విట్టర్లో స్పందిస్తూ తాను హర్ట్ అయినట్లు పేర్కొన్నారు. తన కాలేజీ రోజుల్లో శివుడిని ఆరాధించాక మణిరత్నంని, ఆ తర్వాత ఆర్జీవీని అంతగా ఆరాధించేవాడినని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. మిమ్మల్ని చూసి మన తెలుగువాళ్లకూ ఒక మణిరత్నం అనుకున్నాం. కానీ ఇప్పుడు మీరేమో నా ఇష్టం అని చెప్పి ఏవేవో చేస్తున్నారు. పోండి సార్ మీతో కటీఫ్.. మీరేమీ రిప్లై ఇవ్వక్కర్లేదు. ఇచ్చినా తెలివిగా ఏదో చెప్పేస్తారు...నేను హర్ట్ అయ్య అని ట్వీట్ చేశారు రామజోగయ్య శాస్త్రి.

ఇంతకుముందే హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా ఇలాంటి ట్వీట్ ఏ చేసింది ..ఒకప్పుడు మిమ్మల్ని ఎంతో ఆరాదించాను కానీ ఇప్పుడు మీరు తీస్తున్న సినిమాలు చూస్తుంటే మిమ్మల్ని ఆరాదించినదుకు నాకు బాధేస్తుంది అని ట్వీట్ చేసారు ..పవర్ స్టార్ టైటిల్‌తో సినిమా అనౌన్స్ చేసిన వర్మ.. ఈ సినిమాలో పాత్రలకు సంబంధించిన వివరాలను కూడా చెప్పేశారు. నలుగురు పిల్లలు, ఒక రష్యన్ యువతి, అలాగే 8 బర్రెలు సినిమాలో ఉంటాయని వ్యంగ్యంగా ఆయన చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది.

Tags :
|

Advertisement