Advertisement

  • ట్విట్టర్ లో కరోనా వైరస్ సినిమాపై రామ్ గోపాల్ వర్మ ట్వీట్

ట్విట్టర్ లో కరోనా వైరస్ సినిమాపై రామ్ గోపాల్ వర్మ ట్వీట్

By: chandrasekar Wed, 27 May 2020 6:20 PM

ట్విట్టర్ లో కరోనా వైరస్ సినిమాపై రామ్ గోపాల్ వర్మ ట్వీట్


కరోనా వైరస్ చిత్రాన్ని లాక్ డౌన్ పీరియడ్ లో చిత్రీకరించామని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఐతే ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ మార్గదర్శకాలు పాటించామని ట్విట్టర్ లో పేర్కొన్నారు. అంతే కాదు ఈశ్వర్, అల్లా, జీసస్, గవర్నమెంట్ పై ఒట్టేసి చెబుతున్నా.. అంటూ ఆయన రాయడం విశేషం.

కరోనా వైరస్' ప్రపంచంలోనే మొట్టమొదటగా సినిమా తీసి సంచలనం సృష్టించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మరో వివాదానికి తెరలేపారు. ఆయన తీసిన ప్రతి సినిమా వెనుక వివాదం కచ్చితంగా ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. ఐతే తాజాగా 'కరోనా వైరస్'పై సినిమా తీశారు రామ్ గోపాల్ వర్మ. అన్ని సినిమాలకు ఉన్న విధంగానే దీనికీ ఓ వివాదం సృష్టించారు వర్మ. ఆయన వివాదం వెనుక పబ్లిసిటీ స్టంట్ దాగి ఉందన్న ప్రచారమూ లేకపోలేదు. ఐతే ఇప్పుడు తాజాగా ఆయన రేపిన వివాదం కూడా చిత్రం ప్రమోషన్ కోసం చేశారా? అనేది తెలియాల్సి ఉంది.


ram gopal,verma,tweeted,corona virus,movie ,ట్విట్టర్, కరోనా, వైరస్, సినిమాపై, రామ్ గోపాల్ వర్మ


కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. వ్యాపార, వాణిజ్యాలు అన్నీ బంద్ అయ్యాయి. జనం ఇళ్ల నుంచి బయటకు రాకుండా నిబంధనలు విధించారు. ఇందుకు చిత్ర పరిశ్రమకు మినహాయింపు లేదు. చిత్ర పరిశ్రమలోనూ షూటింగ్ లు, థియేటర్లు అన్నీ బంద్ అయ్యాయి. ఐతే కరోనా వైరస్ సినిమాకు సంబంధించి ట్రెయిలర్ నిన్న విడుదల చేసిన తర్వాత వర్మ బుధవారం ఉదయం ఓ ట్వీట్ చేశారు. అదే ఇప్పుడు కొత్త వివాదానికి తెరలేపుతోంది.

Tags :
|

Advertisement