Advertisement

  • సర్కార్ నేను మీకోసం ప్రార్ధించను ...బిగ్ బి కరోనా పై సంచలన వ్యాఖ్యలు చేసిన వర్మ ..

సర్కార్ నేను మీకోసం ప్రార్ధించను ...బిగ్ బి కరోనా పై సంచలన వ్యాఖ్యలు చేసిన వర్మ ..

By: Sankar Sun, 12 July 2020 3:07 PM

సర్కార్ నేను మీకోసం ప్రార్ధించను ...బిగ్ బి కరోనా పై సంచలన వ్యాఖ్యలు చేసిన వర్మ ..



బిగ్ బి అమితాబ్ బచ్చన్ కరోనా భారిన పడ్డారు అని తెలియగానే ఆయనతో పని చేసిన వారు , సినిమా ఇండస్ట్రీ లో ఉన్న వారు అమితాబ్ త్వరగా కోలుకోవాలని సందేశాలను పంపుతున్నారు ..అయితే అమితాబ్ గారితో సూపర్ హిట్ సినిమాలు తీసిన వర్మ మాత్రం నేను మీరు కరోనా నుంచి కోలుకోవాలని ప్రార్ధించడం లేదు అని అన్నారు ..

వర్మ ట్విట్టర్లో సర్కార్ మీరు కరోనా నుంచి కోలుకుంటారని నాకు తెలుసు. ఎప్పటిలాగే మరింత బలంగా తిరిగి వస్తారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అందుకే మీ కోసం నేను ప్రార్ధించను. కరోనా కారణంగా చనిపోతున్న వారి కోసం ప్రార్థిస్తాను'' అని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. దీంతో ఆయనిచ్చిన ఈ వెరైటీ రియాక్షన్ చూసి నెటిజన్స్ మిశ్రమంగా స్పందిస్తున్నారు.

ఇటీవల కాలంలో వర్మ తనకు తోచిన విధంగా మాట్లాడుతూ వివాదాలకు కేర్ అఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాడు ..వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు ..తాజాగా పవర్ స్టార్ పేరుతో సినిమా ప్రకటించిన వర్మ వరుసగా పోస్టర్లు రిలీజ్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు ...

Tags :
|
|

Advertisement