Advertisement

రామ్ గోపాల్ వర్మ నెక్స్ట్ క్రియేషన్ ?

By: chandrasekar Tue, 29 Sept 2020 12:37 PM

రామ్ గోపాల్ వర్మ నెక్స్ట్ క్రియేషన్ ?


వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎవరూ ఊహించని అంశాలతో మూవీని ప్లాన్ చేసి హైప్ క్రియేట్ చేయడం వర్మకు వెన్నెతో పెట్టిన విద్య. ఇటీవలే వరుసగా సినిమాలు ప్రకటిస్తోన్న రామ్ గోపాల్ వర్మ గురించి మరో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనావైరస్ తో పాటు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత జరుగుతోన్న పరిణామాలు వార్తల్లో నిలుస్తున్నాయి. ఇలాంటి సమయంలో రియా చక్రవర్తిపై రామ్ గోపాల్ వర్మ సినిమా తీయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ న్యూస్ యాంకర్ అర్నబ్ గోస్వామిపై సినిమా తీయడం గురించి ప్రకటించిన వర్మ ఇందులోనే రియా పాత్రను చొప్పించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది.

సుశాంత్ సింగ్ మరణం తరువాత అతని ఆత్మహత్యకు పరోక్షంగా రియానే కారణం అంటూ సోషల్ మీడియాలో చాలా మంది పోస్టులు పెట్టారు. పోలీసులు, దర్యాప్తు సంస్థలు కూడా రియాను విచారించి డగ్స్ కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశంపై బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రముఖ కథానాయికలు కూడా నార్కోటిక్స్ అధికారుల విచారణకు హాజరయ్యారు. ఇంత సెస్సేషన్ అంశంపై రామ్ గోపాల్ వర్మ సినిమా తీసినా తీయవచ్చు అంటున్నారు కొంత మంది. అయితే దీనిపై వర్మ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

Tags :
|
|

Advertisement