Advertisement

  • పవన్ కళ్యాణ్ కు నేను చెప్పిన కథ నచ్చలేదు..అందుకే ఆయన రిజెక్ట్ చేసాడు ..వర్మ

పవన్ కళ్యాణ్ కు నేను చెప్పిన కథ నచ్చలేదు..అందుకే ఆయన రిజెక్ట్ చేసాడు ..వర్మ

By: Sankar Wed, 29 July 2020 6:11 PM

పవన్ కళ్యాణ్ కు నేను చెప్పిన కథ నచ్చలేదు..అందుకే ఆయన రిజెక్ట్ చేసాడు ..వర్మ



వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ , పవన్ కళ్యాణ్ కు మధ్య డైరెక్ట్ గా ఎప్పుడు విభేదాలు లేకున్నా కూడా వర్మ మాత్రం ఎక్కువగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నాడు అని మెగా అభిమానులు ఎప్పుడు వర్మ మీద విమర్శలు చేస్తుంటారు ..అయితే పవన్ కళ్యాణ్ కు తనకు అసలు విభేదాలే లేవు అని అన్నాడు ఈ సంచలన దర్శకుడు ..పవన్ కు , చిరు కు కథలు చెప్పిన మాట వాస్తవమే గాని వారు వాటిని రిజెక్ట్ చేయడం వల్లనే నేను వారి మీద ఇలా చేస్తున్న అనడం సరికాదు అని అన్నాడు ..

అందరూ అనుకున్నట్టు చిరంజీవి, పవన్ కళ్యాణ్, నేనూ.. మేం ముగ్గురం ఎప్పుడూ కలిసి స్టోరీ డిస్కస్ చేసింది లేదు. పవన్ కళ్యాణ్‌ను వేరేగా.. చిరంజీవిని వేరేగా కలిశాను. పవన్ కళ్యాణ్‌కి ఒక కథ చెప్పిన మాట నిజమే. కాని అప్పటికి పవన్ కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు. ఇది జరిగి 25 ఏళ్లు పైనే అవుతుంది.

నేను తీసే సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం పవన్ కళ్యాణ్‌ని కలిశా. కథ చెప్పా.. కాని ఆయన లేచి సీరియస్‌గా వెళ్లిపోయారు. నేను చేయను అన్నారు. పవన్ చేసింది కరెక్టే.. ఎందుకంటే ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నారు.. ఆ సందర్భంలో నేను వేరే రోల్ కోసం అడిగా.. ఆయనకు నచ్చలేదు.. చేయను అన్నారు.. అది ఆయన ఇష్టం. అయినా ఆయన ఆ పాత్ర చేయకపోవడమే మంచిది అయింది ఎందుకంటే ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయింది దీనితో నేను అప్పుడే కళ్యాణ్ జడ్జిమెంట్ సరైనది అని గ్రహించాను ..ఇక పవన్ తో నేను అప్పుడప్పుడు ఫోన్ కూడా మాట్లాడుతుంటాను ..పార్టీ పెట్టినప్పుడు ఫోన్ చేసి అభినందనలు కూడా తెలిపాను అని అన్నాడు వర్మ

Tags :
|

Advertisement