Advertisement

  • వర్మ మరొక సంచలనం ..మర్డర్ సినిమా ట్రైలర్ విడుదల

వర్మ మరొక సంచలనం ..మర్డర్ సినిమా ట్రైలర్ విడుదల

By: Sankar Tue, 28 July 2020 10:09 AM

వర్మ మరొక సంచలనం ..మర్డర్ సినిమా ట్రైలర్ విడుదల



సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ సినిమా తర్వాత మరొక సినిమా మీద గురి పెట్టాడు ..పవర్ స్టార్ సినిమాతో బాగానే సంపాదించిన వర్మ , తాజాగా అమృత , మారుతీ రావు ల కథ అయిన మర్డర్ సినిమా మీద పడ్డాడు ..రెండు తెలుగు రాష్ట్రాల్లోనే గాక దేశవ్యాప్త సంచలనం సృష్టించిన మారుతీరావు- అమృత రియల్ స్టోరీ ఆధారంగా ఈ మూవీ రూపొందిస్తున్నారు.

వర్మ సమర్పణలో ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు 'కుటుంబ కథా చిత్రమ్' అనే ట్యాగ్ లైన్ పెట్టి ఆసక్తి రేకెత్తించిన ఆర్జీవీ.. ఇప్పటికే పలు పోస్టర్స్ రిలీజ్ చేసి సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు. తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేసి మర్డర్ జరిగిన తీరు, ఆ సన్నివేశాలన్నీ కళ్ళకు కట్టినట్లు చూపించారు.

ఓ తండ్రి.. అల్లారుముద్దుగా పెంచుకున్న తన కూతురు చెప్పిన మాట వినకుండా చేసిన ఓ పనితో ఆ తర్వాత జరిగిన పరిణామాలు, హత్య అన్నీ చూపిస్తూ రక్తికట్టించారు వర్మ. ''పిల్లలని ప్రేమించడం తప్పా?, తప్పు చేస్తే దండించడం తప్పా? వేరే గతి లేనప్పుడు చంపించడం తప్పా?, పిల్లల్ని కనగలం కానీ వారి మనస్తత్వాలను కనగలమా? సమాధానం మీరే చెప్పండి అంటూ ట్రైలర్ ముగించారు వర్మ. ఈ ట్రైలర్ చూస్తుంటే ప్రణయ్ హత్యోదంతం తాలూకు పూర్తి విషయాలతో ఈ మూవీ రూపొందించారని తెలుస్తోంది.

Tags :
|
|

Advertisement