Advertisement

25 రూపాయలు కట్టు ..పవర్ స్టార్ ట్రైలర్ చూడు

By: Sankar Sun, 19 July 2020 09:28 AM

25 రూపాయలు కట్టు ..పవర్ స్టార్ ట్రైలర్ చూడు



కరోనా వచ్చిన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో రామ్ గోపాల్ వర్మ చేస్తున్న హల్చల్ అంత ఇంతా కాదు ..కరోనా దాటికి మిగిలిన సినిమా వాళ్ళు అంత సైలెంట్ గా ఇంట్లోనే ఉంది పోతే వర్మ మాత్రం తన మార్క్ పబ్లిసిటీ తో సినిమాల మీద సినిమాలు చేస్తూ బాగా సంపాదిస్తున్నాడు ..నగ్నం , క్లైమాక్స్ , వంటి సినిమాలను తన ఆర్జీవీ వరల్డ్ లో రిలీజ్ చేసి అవి చూడటానికి టికెట్ రేట్ పెట్టి బాగా సంపాదించిన వర్మ తన లేటెస్ట్ మూవీ పవర్ స్టార్ విషయంలో మరొక అడుగు ముందుకు వేసాడు ..

ప్రపంచ సినిమా చరిత్రలోనే ఎవ్వరు చేయని విధంగా ట్రైలర్ చూడాలంటే డబ్బులు కట్టాల్సిందే అని ప్రకటించాడు ..ఇదగో పవర్ స్టార్ ట్రైలర్‌ని జూలై 22 ఉదయం 11 గంటలకుఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో విడుదల చేస్తున్నా.. ఇది చూడాలంటే రూ.25 పెట్టాల్సిందే అంటూ పోస్టర్ విడుదల చేశాడు. ప్రపంచంలోనే ఇది ఫస్ట్ పెయిడ్ ట్రైలర్ అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు వర్మ.

అయితే డబ్బులు పెట్టి ట్రైలర్ ఎవరు చూస్తారు వర్మ పిచ్చి కాకపోతే అనుకుంటే మాత్రం మనం పొరబడినట్లే ..ఒక సినిమాకు ఎలా హైప్ తీసుకురావాలో వర్మకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు ..పవర్ స్టార్ సినిమా విషయంలో సినిమా పేరు దగ్గరి నుంచి రిలీజ్ చేసే ప్రతి పోస్టర్ లోను ఎదో ఒక కాంట్రవర్సీ ఉండేలా చూసుకున్న వర్మ జనానికి ఆ సినిమా మీద ఆసక్తిని పెంచడంలో వందకు రెండొందల శాతం సక్సెస్ అయ్యాడు ...ఎవ్వరికి జీవిత కథ కాదు కేవలం కల్పితం అంటూనే చేయాల్సినవి అన్ని చేస్తున్నాడు వర్మ ..మరి చూడాలి ప్రేక్షకులు ట్రైలర్ విషయంలో ఎన్ని రికార్డులు బద్దలు కొడతారో ..

Tags :

Advertisement