Advertisement

  • మెగా ఫ్యామిలీతో విభేదాలు , మెగాస్టార్ చిరంజీవితో సినిమా ఆగిపోవడం గురించి స్పందించిన వర్మ

మెగా ఫ్యామిలీతో విభేదాలు , మెగాస్టార్ చిరంజీవితో సినిమా ఆగిపోవడం గురించి స్పందించిన వర్మ

By: Sankar Wed, 29 July 2020 5:30 PM

మెగా ఫ్యామిలీతో విభేదాలు , మెగాస్టార్ చిరంజీవితో సినిమా ఆగిపోవడం గురించి స్పందించిన వర్మ



సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు మెగా ఫ్యామిలీ ని టార్గెట్ చేసినట్లు ఉంటుంది ఆయన చేసే పనులు..రీసెంట్ గా పవర్ స్టార్ అనే పేరుతో సినిమా తీసి ఇంకా ఎక్కువ విమర్శలకు గురి అయ్యాడు ..అయితే అసలు తనకు , మెగా ఫామిలీ కి ఉన్న విభేదాలు ఏంటో ఒక ఇంటర్వ్యూలో వర్మ చెప్పాడు ..

చిరంజీవితో నాకు విభేదాలు.. మెగా ఫ్యామిలీతో పడదని అంటారు... వాళ్లంటే కోపం అని అంటారు. నిజానికి నేను నా లైఫ్‌లో నేను ఎవరిపైన కోప్పడను. ఎందుకంటే.. నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వను. కోపం అనేది వ్యాలిబుల్ ఎమోషన్. నాకు ఏ మాత్రం ఇంటరాక్షన్ లేకుండా ఒక మనిషిపై కోపం చూపించాల్సిన అవసరం నాకేం ఉంది.. నాకు చిరంజీవి ఫ్యామిలీపై కోపం లేదు.. పగ లేదు.. ఏం లేదు.

చిరంజీవితో సినిమా చేయాలని అనుకున్నాను.. కథ ఆయనకు నచ్చింది.. అయితే నేను చేసిన మిస్టేక్స్ వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఆ సినిమా ఆగిపోయిన సందర్భంలో ఆయన చెప్పకుండానే.. నేనే పత్రికాముఖంగా అందులో నా తప్పే ఉందని ఎన్నోసార్లు చెప్పాను. అప్పట్లో ఊర్మిళ, చిరంజీవితో సినిమా తీయాలని అనుకున్నా.. నా మిస్టేక్స్ వల్ల ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. చిరంజీవి గారు చేసిన తప్పు లేదు..

ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి కారణం.. ఆయన నా డైరెక్షన్‌లో వేలు పెట్టారని రూమర్స్ వచ్చాయి. అవి నిజం కాదు. అదంతా తప్పుడు ప్రచారం.. చిరంజీవి ప్రొఫెషనల్ యాక్టర్. నా సినిమానే కాదు.. ఆయన ఎవరి సినిమాలోనూ వేలు పెట్టరు. నటుడిగా పూర్తి న్యాయం చేయడానికి చూస్తారు. సినిమా ఆగిపోవడానికి రీజన్ అది కాదు.. నా పర్శనల్ రీజన్. ఇందులో చిరంజీవి గారి తప్పు లేదు’ అంటూ అసలు విషయం చెప్పుకొచ్చారు రామ్ గోపాల్ వర్మ.


Tags :
|
|

Advertisement