Advertisement

  • ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కు పది రోజులు దూరం కానున్న రామ్ చరణ్

ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కు పది రోజులు దూరం కానున్న రామ్ చరణ్

By: chandrasekar Mon, 30 Nov 2020 11:20 PM

ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కు పది రోజులు దూరం కానున్న రామ్ చరణ్


ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కు రామ్ చరణ్ పది రోజులు దూరం కానున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ కరోనా ప్యాండమిక్ తర్వాత వేగంగా జరుగుతుంది. బయట ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వీలైనంత తక్కువ మందితోనే దర్శక ధీరుడు రాజమౌళి షూటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మేజర్ యాక్షన్ సీక్వెన్స్ ఒకటి పూర్తైపోయింది. 50 రోజుల పాటు దీన్ని చిత్రీకరించాడు దర్శకుడు రాజమౌళి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌లో ప్రముఖ హీరోలు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఇద్దరూ పాల్గొంటున్నారు. ఆ మధ్య దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత ట్రిపుల్ ఆర్ సెట్‌లో ఎన్టీఆర్ అడుగు పెట్టాడు. ముందు నుంచి కూడా షూటింగ్ సెట్‌లోనే ఉన్నాడు మెగా వారసుడు రామ్ చరణ్. అయితే మొన్న జూనియర్ సెలవు తీసుకున్నారు కానీ ఇప్పుడు రామ్ చరణ్ కూడా బ్రేక్ తీసికోబోతున్నాడు. రామ్ చరణ్ తన వ్యక్తిగత కారణాలతో బ్రేక్ కావాలని రాజమౌళికి అర్జీ పెట్టుకున్నాడు. ఆ వ్యక్తిగత కారణం ఏంటో అందరికీ తెలిసిందే. డిసెంబర్ 9న రామ్ చరణ్ చెల్లి నిహారిక పెళ్లి జరగనుంది. చైతన్య జొన్నలగడ్డతో ఈమె పెళ్లి డిసెంబర్ లో జరగబోతుంది.

అన్నగా చెల్లెలి పెళ్లి లో పాల్గొనుటకు రామ్ చరణ్ ఇప్పుడు తయారవుతున్నాడు. ఇప్పటికే నిహారిక పెళ్లి గురించి ఇండస్ట్రీ అంతా చర్చ నడుస్తుంది. డిసెంబర్ 9న ఉదయ్‌పూర్ కోటలో నిహా పెళ్లి జరగనుంది. కోవిడ్‌ను దృష్టిలో పెట్టుకుని చాలా తక్కువ మందికి మాత్రమే ఈమె పెళ్లి పత్రికలు వెళ్లాయి. పరిస్థితులన్నీ సర్దుకున్నాక హైదరాబాద్‌లోనే సినీ రాజకీయ ప్రముఖులకు పార్టీ అరేంజ్ చేయనున్నారు మెగా ఫ్యామిలీ. ఇప్పుడు పెళ్లికి మాత్రం కేవలం ఇరు కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు కొద్దిమంది మాత్రమే హాజరు కానున్నారు. డిసెంబర్ 9నే పెళ్లి అందువల్ల ఇక మరో 10 రోజులు మాత్రమే ఉండటంతో అన్నగా రామ్ చరణ్ తన బాధ్యత తీసుకుంటున్నాడు. దీనికోసమే వారం రోజులైనా బ్రేక్ కావాల్సిందే అని రాజమౌళిని కోరాడు మెగా వారసుడు. ఆయన కోరడం రాజమౌళి అనుమతి ఇవ్వకపోవడం ఉంటాయా వెంటనే పర్మిషన్ కూడా వచ్చేసింది. ఇందువల్ల రాబోయే పది రోజులు రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సెట్‌లో కనిపించడు. అతను వచ్చిన తర్వాత రాజమౌళి మరో మేజర్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాపై అభిమానులు చాలా ఎదురు చూపుతోవున్నారు. రాజమౌళి దర్శకత్వం వల్ల బారి విజయాన్నే అందుకుంటుందని అందరూ ఎదురుచూస్తున్నారు.

Tags :
|

Advertisement