Advertisement

  • ఉమామహేశ్వరుడి ఉగ్రరూపానికి ఫిదా అయిన మెగా పవర్ స్టార్

ఉమామహేశ్వరుడి ఉగ్రరూపానికి ఫిదా అయిన మెగా పవర్ స్టార్

By: Sankar Mon, 10 Aug 2020 8:45 PM

ఉమామహేశ్వరుడి ఉగ్రరూపానికి ఫిదా అయిన మెగా పవర్ స్టార్



సత్యదేవ్ హీరోగా ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సినీ ప్రముఖులు కూడా చాలా బాగుందంటూ కొనియాడుతున్నారు.

చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా ఈ ఖాతాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా చేరారు. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. నటీనటుల ప్రదర్శనను కొనియాడారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఆయన ట్వీట్ చేశారు.

ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా నాకు ఎంతగానో నచ్చింది. నిజంగా కథపై ఆధారపడి తీసిన సినిమా. సత్యదేవ్, నరేష్ గారు, సుహాస్, హరి చందన, రూపల మనోరంజకమైన నటన నన్ను కట్టిపడేసింది. నీ టీమ్ నుంచి ది బెస్ట్ రాబట్టగలిగావు వెంకటేష్ మహా. ఇంత గొప్ప విజయం సాధించినందుకు విజయ ప్రవీణ పరుచూరి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఆర్కా మీడియా వర్స్క్ టీమ్‌కి అభినందనలు’’ అని రామ్ చరణ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Tags :

Advertisement