Advertisement

RRR సినిమా ఐటెం సాంగ్ లో రకుల్ ప్రీత్ సింగ్

By: chandrasekar Mon, 01 June 2020 10:14 PM

RRR సినిమా ఐటెం సాంగ్ లో రకుల్ ప్రీత్ సింగ్


రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న RRR సినిమాలో ఐటెం సాంగ్ ఉందని, అందులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మెరవనుందని తెలుస్తోంది. బాహుబలి లాంటి భారీ సిరీస్ తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని RRR మూవీ రూపొందిస్తున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. డీవీవీ దానయ్య నిర్మాణంలో భారీ బడ్జెట్ కేటాయించి సర్వ హంగులతో ఈ మూవీ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తుండగా ఆ ఇద్దరి సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, హాలీవుడ్ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ కూడా ఫినిష్ అయింది. సరిగ్గా ఈ టైమ్‌లో RRRలో ఐటెం సాంగ్ ఉందని, ఇందులో రకుల్ అందాల డోస్ మెస్మరైజ్ చేయనుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

rakul preet singh in rrr movie item song ,సినిమా, ఐటెం, సాంగ్ లో, రకుల్ ప్రీత్, సింగ్


పలు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్, హాలీవుడ్ భామలను భాగం చేసిన జక్కన్న ఐటెం సాంగ్ ద్వారా టాలీవుడ్ ఓ బ్యూటీతో చిందులేయించాలని స్కెచ్ వేశారట. ఈ క్రమంలోనే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌తో ఆ సాంగ్ షూటింగ్ చేశారని చెప్పుకుంటున్నారు. అయితే దీనిపై ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాకపోవడమే గాక, ఇటు రకుల్ గానీ అటు RRR యూనిట్ గానీ స్పందించక పోవడంతో టాలీవుడ్ జనాల్లో క్యూరియాసిటీ పెరిగిపోతోంది.

ఇదిలా ఉంటే ఈ భారీ మూవీకి ఇటీవలే 'రౌద్రం ర‌ణం రుధిరం' అనే టైటిల్ ఫిక్స్ చేసిన చిత్రయూనిట్ తదుపరి షెడ్యూల్స్ కోసం రెడీ అవుతోంది. లాక్‌డౌన్ ఫినిష్ కాగానే తదుపరి పార్ట్ షూట్ చేయాలని ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తుండగా, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, భగత్ సింగ్ పాత్రలో అజయ్ దేవగణ్ నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి.

Tags :

Advertisement