Advertisement

  • మెగాస్టార్ చిరంజీవి ఇంట ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

మెగాస్టార్ చిరంజీవి ఇంట ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

By: chandrasekar Tue, 04 Aug 2020 4:30 PM

మెగాస్టార్ చిరంజీవి ఇంట ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు


మన దేశంలో రాఖీ పౌర్ణమి కుల మతాలకు అతీతంగా ప్రతీ ఒకరు ఘనంగా నిర్వహించుకుంటారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇంట రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇద్దరు చెల్లెల్లు వచ్చి మెగా బ్రదర్‌కు రాఖీ కట్టారు. అన్నయ్య ఆశీర్వాదాలు తీసుకున్నారు. స్వీట్లు తినిపించి రాఖీ పండగను సెలబ్రేట్ చేసుకున్నారు.

ఈ సందర్భంగా చిరంజీవి తన ఇద్దరు చెల్లెల్లకు అద్భుతమైన బహుమతి ఇచ్చారు. ఇద్దరికి రెండు హారాలు బహుమానంగా అందించారు. ఇద్దరకీ ఒకేలాంటి గిఫ్ట్ ఇస్తున్నాను మళ్లీ కొట్టుకోకుండా అంటూ చిరు తన బహుమతిని అందించారు. చిరంజీవి అలా అనగానే ముగ్గురు ఒకేసారి నవ్వుతూ అప్యాయంగా ఒకరినొకరు కౌగిలించుకున్నారు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన చెల్లెల్లతోనే కాదు తెలుగింటి ఆడుపడుచలందరితోనూ అన్నయ్య అనే పిలిపించుకునే అదృష్టం అతనిది అన్నారు. రాఖీ పండగ సందర్భంగా తెలుగు ఆడపడుచులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి. చిరుకు ప్రతీ ఏడాది ఆయన ఇద్దరు చెల్లెల్లు వచ్చి రాఖీ కట్టి ఆశీస్సులు పొందుతూ ఉంటారు.

Tags :

Advertisement