Advertisement

  • రాజ్‌తరుణ్ మరోసారి జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చాడు

రాజ్‌తరుణ్ మరోసారి జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చాడు

By: chandrasekar Mon, 06 July 2020 1:58 PM

రాజ్‌తరుణ్ మరోసారి జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చాడు


జబర్దస్త్ కామెడీ షోకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కార్యక్రమం గ్యాప్ వచ్చినా కూడా లాక్‌డౌన్ తర్వాత మళ్లీ మంచి రేటింగ్స్ తెచ్చుకుంది. అందరికీ నవ్వులు పంచుతూ దూసుకుపోతున్న ఈ ప్రోగ్రామ్‌లో సినిమా ప్రమోషన్స్ కూడా బాగానే జరుగుతుంటాయి.

ఈ క్రమంలోనే ఇప్పుడు రాజ్‌తరుణ్ మరోసారి జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చాడు. ఓ స్కిట్‌లో అందరికీ నవ్వులు పూయించాడు ఈయన. ఇప్పటికే ఈ ఏడాది ఇద్దరి లోకం ఒక్కటే అంటూ డిజాస్టర్ ఇచ్చాడు రాజ్‌తరుణ్. త్వరలోనే ఒరేయ్ బుజ్జిగా సినిమాతో రాబోతున్నాడు.

ఈ సినిమాపై అంచనాలు కూడా లేవు కానీ కచ్చితంగా ఒరేయ్ బుజ్జిగా తనను రైట్ ట్రాక్‌లో పెడుతుందని నమ్ముతున్నాడు రాజ్. పైగా ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేస్తారని ముందు వార్తలు వచ్చినా కూడా అదేం కాదు థియేటర్స్ ఓపెన్ చేసిన తర్వాతే తన సినిమాను విడుదల చేస్తారని చెప్తున్నాడు ఈ కుర్ర హీరో.

Tags :
|

Advertisement