Advertisement

  • తన భార్య విషయంలో రాజీవ్ కనకాల క్లారిటీ ఇచ్చాడు...!

తన భార్య విషయంలో రాజీవ్ కనకాల క్లారిటీ ఇచ్చాడు...!

By: Anji Sat, 14 Nov 2020 3:52 PM

తన భార్య విషయంలో రాజీవ్ కనకాల క్లారిటీ ఇచ్చాడు...!

భర్త రాజీవ్ నుండి సుమ విడిపోయి విడి విడిగా ఉంటున్నారు.. విడాకులు తీసుకున్నారు అంటూ పిచ్చి పుకార్లు గతంలో వచ్చాయి. తాజాగా ఆ విషయమై రాజీవ్ కనకాల క్లారిటీ ఇచ్చాడు.

కుటుంబం అన్నప్పుడు చిన్న చిన్న కలహాలు గొడవలు కామన్ గా ఉంటాయి. అన్ని ఇళ్లలో మాదిరిగానే మా ఇంట్లో కూడా చిన్న చిన్న గొడవలు జరిగాయి. అంతే తప్ప విడాకుల వరకు వెళ్లలేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.

భార్య భర్తల మద్య గొడవలు కామన్ కాని అది సుమ రాజీవ్ ల గొడవ అవ్వడం వల్ల చాలా పెద్దగా జనాలకు కనిపించింది. దాంతో కొందరు విడాకులు తీసుకున్నారు అంటూ రాసేశారు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నామని అన్నాడు. ప్రస్తుతం తమ కొడుకును హీరోగా నిలబెట్టేందుకు మేము ప్రయత్నం చేస్తున్నట్లుగా రాజీవ్ తెలిపాడు.

Tags :

Advertisement