Advertisement

  • ఆకాశంలో ప్రయాణిస్తూ కేక్ కట్ చేసిన రజిని...

ఆకాశంలో ప్రయాణిస్తూ కేక్ కట్ చేసిన రజిని...

By: chandrasekar Mon, 14 Dec 2020 8:33 PM

ఆకాశంలో ప్రయాణిస్తూ కేక్ కట్ చేసిన రజిని...


డిసెంబర్ 12న సూపర్ స్టార్ రజినీకాంత్ 70వ పుట్టినరోజు సందర్భంగా తమిళనాడులో అభిమానుల హంగామా అంతా ఇంతా కాదు. రజినీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా అనేక చోట్ల కేకులు కట్ చేసారు.

కానీ, రజినీకాంత్ ఈ సారి వెరైటీగా విమానంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఆ రోజు పార్టీ పనుల నిమిత్తం రజినీ ఢిల్లీ ఉండటంతో ఇంట్లోనే పుట్టినరోజు ఫంక్షన్ చేసుకోలేకపోయారు.

‘అన్నాత్తై’ షూటింగ్ నిమిత్తం రజినీకాంత్ తన యూనిట్‌తో కలిసి ఆదివారం చెన్నై నుంచి హైదరాబాద్‌ చేరుకున్నారు.

ఈ సందర్భంగా విమానం ఆకాశంలో ప్రయాణిస్తూ రజినీ కేక్ కటింగ్ చేశారు. ఈ వేడుకల్లో రజినీ కుమార్తె ఐశ్వర్య ధనుష్, హీరోయిన్ నయనతారతో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Tags :
|
|
|

Advertisement