Advertisement

  • పర్ఫెక్షన్ తో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేస్తున్న రాజమౌళి...

పర్ఫెక్షన్ తో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేస్తున్న రాజమౌళి...

By: chandrasekar Fri, 18 Dec 2020 9:05 PM

పర్ఫెక్షన్ తో  ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేస్తున్న రాజమౌళి...


ఇటీవల హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో భారీ షెడ్యూల్‌ను RRR చిత్ర యూనిట్ పూర్తిచేసిన విషయం తెలిసిందే. ఈ 55 రోజుల షెడ్యూల్‌లో భారీ పోరాట సన్నివేశాలను దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి చిత్రీకరించారు. కేవలం 8 నిమిషాల ఫైట్ సీన్ కోసం రాజమౌళి 55 రోజుల పాటు రాత్రింబవళ్లు కష్టపడ్డారట, క్వాలిటీ కోసం రాజమౌళి ఎంతదూరమైనా వెళ్తారనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఫైట్ క్లైమాక్స్‌లో వస్తుందట. ఈ షెడ్యూల్‌లో హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో పాటు ఫైటర్లు, జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు.

ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కొమురం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సరసన బ్రిటిష్ అమ్మాయిగా ఒలీవియా మోరిస్ నటించనున్నారు. రామ్ చరణ్‌కు జోడీగా సీత పాత్రలో ఆలియా భట్ నటిస్తున్నారు. డి.వి.వి. ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై డి.వి.వి. దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో సముద్రఖని, శ్రియ, అలిసన్ డూడీ, రే స్టీవెన్‌సన్, అజయ్ దేవగణ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యం.యం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Tags :

Advertisement