Advertisement

‘రాధేశ్యామ్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల

By: chandrasekar Sat, 11 July 2020 10:33 AM

‘రాధేశ్యామ్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల


తెలుగు వారి కీర్తిని ఖండంతరాలు దాటించిన సినిమా ‘బాహుబలి’. ప్రపంచ సినిమా సైతం ఒక్కసారిగా తెలుగు సినిమా గురించి గొప్పగా చెప్పుకునేటట్లు చేసిన ఘనత సాధించిన విజయమిది.

ఇంతటి అపూర్వ సినిమాకి అంకుర్పారణ జరిగి నేటికి ఐదేళ్లు. ‘బాహుబలి’ చిత్రీకరణ ప్రారంభమై నేటికి ఐదు వసంతాలు పూర్తిచేసుకుంది.

కాగా ఈ రోజే ప్రభాస్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల కావడం పట్ల అందరిలోనూ ‘బాహుబలి’ సెంటిమెంట్‌తో ఈ రోజు విడుదల చేశారా లేక కాకతాళీయంగా జరిగిందా అనే సందేహం వ్యక్తం అవుతుంది.

సినీ పరిశ్రమలో సెంటిమెంట్లకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో ముహుర్తాలు, తేదీల సెంటిమెంట్స్‌ అధికం. బాహుబలిలా రాధేశ్యామ్‌ అందరూ అబ్బురపడే విజయం పొందాలని ప్రభాస్‌ అభిమానులు ఆశిస్తున్నారు.

Tags :
|
|

Advertisement