Advertisement

  • రంగస్థలంలో ఆ క్యారెక్టర్ తొలుత నాకే వచ్చింది ..రాశి

రంగస్థలంలో ఆ క్యారెక్టర్ తొలుత నాకే వచ్చింది ..రాశి

By: Sankar Tue, 01 Dec 2020 9:24 PM

రంగస్థలంలో ఆ క్యారెక్టర్ తొలుత నాకే వచ్చింది ..రాశి


రాశి ..తెలుగు సినిమాలో ఈ పేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు...ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తెలుగులో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది...అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రంగస్థలం సినిమా ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందో తెలిపింది అలాగే మహేష్ బాబు నిజం సినిమాలో ఎందుకు నటించిందో కూడా వివరించింది..

ఆమె మాట్లాడుతూ.. ‘రంగస్థలం సూపర్‌ హిట్‌ సాధించింది. ఇందులోని రంగమ్మత్త క్యారెక్టర్‌కు మంచి గుర్తింపు వచ్చింది. దర్శకుడు నాకు ఈ పాత్ర గురించి వివరించినప్పుడు నాకు కూడా రంగమ్మత్త నచ్చింది. కానీ ఇందులో ఆమె మోకాళ్లపై వరకు చీర కట్టుకోవాలి. ఆ లుక్‌ నాకు నప్పదని భావించి రంగమ్మత్త పాత్రను తిరస్కరించాను’ అని ఆమె స్పష్టం చేశారు. అయితే మహేశ్‌ బాబు ‘నిజం’ సినిమాలో రాశి నెగిటివ్‌ రోల్‌ చేసిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ఈ సినిమాలో తన పాత్రను గుర్తుచేసుకుంటూ... ఇందులో నెగిటివ్‌ రోల్‌ చేసి తప్పు చేశానన్నారు. ఇందులో గోపీచంద్‌కు తను లవర్‌గా నటించాలని దర్శకుడు తేజ కథ వివరించారని చెప్పారు. అయితే షూటింగ్ తొలి రోజే ఆ పాత్ర ఎలాంటిదో తనకు అర్థమైందని, దీంతో సినిమా నుంచి తప్పుకుందామని నిర్ణయించుకున్నానన్నారు. ఇదే విషయాన్ని తన పీఆర్వో బాబూరావుకు చెప్పగా... సడన్‌గా సినిమా మధ్యలో ఇలా చేస్తే ఇండస్ట్రీలో తప్పుగా ప్రచారం అవుతుందని ఆయన చెప్పారు. అందుకే ‘నిజం’లో నటించానని రాశి చెప్పుకొచ్చారు.

Tags :
|

Advertisement