Advertisement

  • ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనున్న 'పుష్ప' సీన్స్

ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనున్న 'పుష్ప' సీన్స్

By: chandrasekar Sat, 26 Sept 2020 11:19 AM

ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనున్న 'పుష్ప'  సీన్స్


టాప్ హీరో స్టైలిష్ స్టార్ బన్నీకి తెలుగుతో పాటు దేశ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో యాక్షన్ డ్రామా చిత్రం పుష్పలో నటిస్తున్నాడు. ఈ మూవీలో కన్నడ బ్యూటి రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది. అయితే కరోనావైరస్ వల్ల సినిమా షూటింగ్ కొంత కాలం ఆగిపోగా మళ్లీ చిత్రీకరణ మొదలుపెట్టాలి అని యూనిట్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ యాక్షన్ డ్రామా చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. మరోవైపు పల్లెటూరి అమ్మాయిగా రష్మికా చేయనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో అల్లు అర్జున్ ఇంట్రో సీన్ చాలా స్పెషల్ గా ఉండనుందట. ఇందులో కొన్ని సీన్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయని తెలుస్తోంది.

ముఖ్యంగా ఇందులో పులితో ఫైట్ సీన్ ఉందని.. అది తప్పకుండా ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేస్తుందట. ఈ ఫైట్ సీన్ ను తెరకెక్కించడానికి ప్రత్యేక ప్రణాళిక వేస్తున్నారని దీని కోసం అల్లు అర్జున్ ప్రిపేర్ అవుతున్నాడట. బన్నీ, రష్మికా జోడిగా వస్తోన్న పుష్ప చిత్రం తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇందులో బన్నీపాత్ర తప్పకుండా ఎంటర్ టైన్ చేస్తుందని సమాచారం. ఇంతకు ముందు అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అల వైకుంఠపురములో చిత్రంలో కనిపించాడు.

Tags :

Advertisement