Advertisement

  • సత్యదేవ్ కొత్త సినిమా తిమ్మరుసు టీజర్ విడుదల చేసిన పూరి జగన్నాథ్

సత్యదేవ్ కొత్త సినిమా తిమ్మరుసు టీజర్ విడుదల చేసిన పూరి జగన్నాథ్

By: Sankar Wed, 09 Dec 2020 9:10 PM

సత్యదేవ్ కొత్త సినిమా తిమ్మరుసు టీజర్ విడుదల చేసిన పూరి జగన్నాథ్


ఇటీవల కాలంలో టాలీవుడ్ లో వైవిధ్య భరితమైన కథలతో సినిమాలు చేస్తూ అభిమానుల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్ ..ఇటీవల ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో మంచి హిట్ కొట్టిన సత్యదేవ్ , వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు..

తాజాగా సత్యదేవ్‌ హీరోగా నటిస్తోన్న సినిమా 'తిమ్మరుసు'. నిఖిల్ సిద్దార్థ్ తో కిర్రాక్ పార్టీ వంటి హిట్ సినిమా తీసిన డైరెక్ట‌ర్ శ‌ర‌ణ్ కొప్పిసెట్టి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు. స‌త్య‌దేవ్ హీరోగా న‌టిస్తుండ‌గా..ట్యాక్సీవాలా ఫేం ప్రియాంకా జ‌వాల్క‌ర్ హీరోయిన్ గా న‌టిస్తోంది.

ఈ సినిమా టీజర్‌ను డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ విడుదల చేసి సినిమా మంచి సక్సెస్‌ కావాలని చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.తిమ్మరుసు' టీజర్ లో సత్యదేవ్‌ లాయర్‌ పాత్రలో కనిపిస్తూ.. 'కేసు గెలిచామా ఓడామా అన్న‌ది కాదు ఇంపార్టెంట్.. సంపాద‌న ఎంత‌నేదే ఇంపార్టెంట్‌.. అని ఓ లాయ‌ర్ అంటుంటే.. నాకు మాత్రం న్యాయం గెలవ‌డ‌మే ఇంపార్టెంట్ స‌ర్' అంటూ స‌త్య‌దేవ్ చెప్తున్న సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకుంటున్నాయి.

Tags :
|

Advertisement