Advertisement

  • పోడ్‌కాస్ట్ ద్వారా అలరించిన పూరి జగన్నాథ్ అద్భుతమైన కాంప్లిమెంట్ ఇచ్చిన బన్నీ

పోడ్‌కాస్ట్ ద్వారా అలరించిన పూరి జగన్నాథ్ అద్భుతమైన కాంప్లిమెంట్ ఇచ్చిన బన్నీ

By: chandrasekar Thu, 13 Aug 2020 04:44 AM

పోడ్‌కాస్ట్ ద్వారా అలరించిన పూరి జగన్నాథ్ అద్భుతమైన కాంప్లిమెంట్ ఇచ్చిన బన్నీ


పోడ్‌కాస్ట్ ద్వారా అలరించిన పూరి జగన్నాథ్ అందుకు అద్భుతమైన కాంప్లిమెంట్ ఇచ్చిన బన్నీతో ఎక్‌ట్రా పెగ్ వేస్తానన్న పూరి జగన్నాథ్. సౌత్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇచ్చిన కాంప్లిమెంట్‌కు దర్శకుడు పూరి జగన్నాథ్ ఫిదా అయిపోయారు. ఆ ఆనందంలో ఈరోజు రాత్రికి ఒక ఎక్‌ట్రా పెగ్ వేస్తానని తెలిపారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలు మిగిలిన దర్శకులకు భిన్నంగా ఉంటాయి. ఆయన సినిమాల్లో హీరో మేనరిజం, డైలాగులు ఎవరికైనా ఇట్టే కనెక్ట్ అయిపోతాయి. పూరి డైలాగులు చాలా సూటిగా, సుత్తిలేకుండా ఉంటాయి. ఇప్పటి వరకు తన మాటలను సినిమాల్లో హీరోలతో పలికించిన పూరి ఇప్పుడు తన ఆలోచనలు, సూచనలను పోడ్‌కాస్ట్ ద్వారా శ్రోతలతో పంచుకుంటున్నారు.

జులై 8న ఈ పోడ్‌కాస్ట్‌ను పూరి మొదలుపెట్టగా వీటికి మంచి ఆదరణ లభించింది. సినీ ప్రముఖులు సైతం అద్భతం అంటూ కొనియాడుతున్నారు. ఆయన బుధవారం, ఆగస్టు 12న ఆయన అప్‌లోడ్ చేసిన ఒక పోడ్‌కాస్ట్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు విపరీతంగా నచ్చేసింది. గడిచిన 60వేల సంవత్సరాలుగా దేశంలో ఆడవాళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఆయన ఈ పోడ్‌కాస్ట్ చేశారు. ఇది కూడా ఆయన స్టైల్లోనే సుత్తిలేకుండా సూటిగా ఉంది. ఏ దేశంలో అయితే స్త్రీ గౌరవించబడుతుందో ఆ దేశాలే మనుగడ సాగిస్తాయని స్త్రీకి నరకం చూపించిన దేశాలన్నీ సంకనాకిపోయాయని పూరి అన్నారు.

అసలు అందగత్తెలకు కాదు ర్యాంప్ వాక్‌లు మగాడి తోడు లేకుండా తమ కాళ్ల మీద నిలబడ్డ ఆడవాళ్లకు పెట్టాలి ర్యాంప్ వాక్‌లు. స్వతంత్రంగా బతికగలిగే శక్తివంతమైన మహిళను ఈ దేశంలో సత్కరించాలి. వాళ్లే మన మిస్ ఇండియాలు అని పూరి చాలా గొప్పగా చెప్పారు. ఈ మాటలు అల్లు అర్జున్‌ను ఎంతగానో ఆకర్షించాయి. ఇదే కాదు పూరి పోడ్‌కాస్ట్‌లన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆయన్ని ప్రశంసిస్తూ బన్నీ ఒక ట్వీట్ చేశారు. ఇందుకు బాగా మురిసి పోయిన పూరి రీట్వీట్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు.

పూరి గారి పోడ్‌కాస్ట్‌కు, పూరి గారు! ఎంత అద్భుతమైన అంశాలండి. మీ పోడ్‌కాస్ట్‌లలో చెబుతోన్న వ్యక్తిగత అభిప్రాయాలు నిజంగా లాగిపెట్టి కొడుతున్నట్టున్నాయి. అద్భుతం నాకు చాలా బాగా నచ్చాయి. ఇలాంటి మంచి టాపిక్స్ మరెన్నో మీరు చర్చించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని బన్నీ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనికి పూరి స్పందించారు. మీ ట్వీట్‌ను చదువుతూ నేను ఆనందంతో ఉప్పొంగిపోతున్నాను బన్నీ. మీ లాంటి విజయవంతమైన యంగ్‌స్టర్ నుంచి ఇంత గొప్ప ప్రశంస అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు రాత్రికి ఒక ఎక్‌ట్రా పెగ్ వేస్తా. చీర్స్ లవ్ యు అని పూరి పేర్కొన్నారు. బన్నీ కూడా చీర్స్ సార్ రెస్పెక్ట్ అని రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్లు చూసిన నెటిజన్లకు ఆనందంలో అంతులేకుండా పోయింది.

Tags :
|

Advertisement